ఈ ఫుడ్స్ మీ డైట్ లో ఉన్నాయా.. అయితే మీరు త్వరగా ముసలివారైపోవడం ఖాయం!

ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యకరమైన ఆహారం కంటే అనారోగ్యానికి గురి చేసే ఆహారం పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

నోటికి రుచిగా ఉంటే చాలు ఏదైనా తినేస్తున్నారు.

ఫలితంగా ఊబకాయం, మధుమేహం, గుండెపోటు( Diabetes, Heart attack ) వంటి ఎన్నో జబ్బులు తలెత్తుతున్నాయి.అలాగే ఈ మధ్య చాలా మంది చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తున్నారు.

పాతిక, ముప్పై ఏళ్లకే ముఖంలో వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.ఇందుకు మీరు తీసుకునే ఆహారాలే ప్రధాన కారణం.

అవును కొన్ని కొన్ని ఆహారాలు చర్మ వృద్ధాప్యానికి దారి తీస్తాయి.మిమ్మల్ని ముసలి వారిలా చూపిస్తాయి.

Advertisement

మరి ఇంతకీ ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

అధిక చక్కెర ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొల్లాజెన్( Collagen ) నష్టం జరుగుతుంది.దాంతో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది.

అలాగే మీరు వేయించిన ఆహారాలను తరచుగా తీసుకుంటున్నారా.అయితే చిన్న వయసులోనే మీరు ముసలివారైపోవడం ఖాయం.

నూనెలో వేయించిన ఆహారాలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హాని చేస్తాయి.వేయించిన ఆహారాల్లో అధిక సోడియం మరియు కొవ్వులు ఉంటాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఇవి యవ్వనాన్ని పాడు చేస్తాయి.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలను త్వరగా తీసుకొస్తాయి.

Advertisement

అలాగే ఆల్కహాల్( Alcohol ) తీసుకోవడం వల్ల త్వరగా ముసలివారవుతారు.ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు.ఫలితంగా చర్మం పొడిబారడం తో పాటు వృద్ధాప్యం కనిపిస్తుంది.

కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా డీహైడ్రేట్ అవుతారు.ఇక కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం కూడా చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.కాబట్టి వయసు పైబడిన కూడా యంగ్ గా కనిపించాలి అనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలకు దూరంగా ఉండండి.

డైట్ లో పోషకాహారం చేర్చుకోండి.దాంతో మీరు యంగ్ గానే కాకుండా ఫిట్ గా కూడా ఉంటారు.

తాజా వార్తలు