కొలెస్ట్రాల్ ను కరిగించే ఉత్తమ ఆహారాలివి.. మీ డైట్ లో ఉన్నాయా.. లేదా?

మన శరీరానికి కొలెస్ట్రాల్( Cholestrol ) ఎంతో అవసరం.విటమిన్లు, హార్మోన్లు మరియు కణాల నిర్మాణంలో కొలెస్ట్రాల్ ముఖ్య పాత్రను పోషిస్తుంది.

అయితే మనుషుల్లో మంచి చెడు ఉన్నట్లుగానే కొలెస్ట్రాల్ లో కూడా రెండు రకాలు ఉంటాయి.అందులో మంచి కొలెస్ట్రాల్ ను హెచ్‌డీఎల్( HDL ) అని.చెడు కొలెస్ట్రాల్ ను ఎల్‌డీఎల్( LDL ) అని పిలుస్తారు.హెచ్డీఎల్ తో మనకు ఎలాంటి సమస్య ఉండదు.

కానీ ఎల్‌డీఎల్ తోనే అసలైన సమస్య.ఈ చెడు కొలెస్ట్రాల్ రక్త ధమనుల్లో పేరుకుపోతుంది.

రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపై ఒత్తిడి పెంచుతుంది.గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Advertisement

అందుకే అధికంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవడం ఎంతో ముఖ్యం.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఉత్తమంగా సహాయపడతాయి.

మరి ఇంతకీ ఆ ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.బాదం పప్పు.

( Badam ) కొలెస్ట్రాల్ ను కరిగించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.బాదం పప్పులో అమైనో ఆమ్లాలు, మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

ఇవి కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగిస్తాయి.అందుకే నిత్యం ఐదు నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అలాగే అధిక కొలెస్ట్రాల్ ను దూరం చేయడానికి వెల్లుల్లి( Garlic ) చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.రోజుకు మూడు లేదా నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.బచ్చలి కూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు కూడా కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

Advertisement

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అందుకే ఆయా ఆకుకూరలను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించాలి.

బార్లీ గింజలు( Barley ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా బార్లీ గింజలు సహాయపడతాయి.బార్లీ గింజలతో జావ తయారు చేసుకొని తరచూ తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

ఇక పైనాపిల్( Pineapple ) కూడా కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుంది.పైనాపిల్ నేరుగా తినొచ్చు.లేదా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.ఇలా ఎలా తీసుకున్నా కూడా పైనాపిల్ లో ఉండే పలు సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

తాజా వార్తలు