కంటి చూపును షార్ప్ గా మార్చే ఈ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారా?

కంటి ఆరోగ్యం( Eye health ) పట్ల శ్రద్ధ వహించే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది.మన శరీరంలో అత్యంత సున్నితమైన ఇంద్రియం కళ్ళు.

అటువంటి కళ్ళ విషయంలో అజాగ్రత్తగా ఉండేవారే ఎక్కువగా ఉంటారు.ఇందుకు తగ్గట్లుగానే ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా కంటి చూపు మందగించడం అనేది స్కూలుకు వెళ్లే పిల్లల్లో సైతం తలెత్తుతోంది.వయసు పైబడే సమయానికి కంటి చూపు పూర్తిగా తగ్గిపోతుంది.

అందుకే కంటి చూపును షార్ప్ గా మార్చే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది బాదం పప్పు( Almonds ).కంటి ఆరోగ్యం కోసం రోజుకు ఐదు నానబెట్టిన బాదం పప్పులు తినేందుకు ప్రయత్నించాలి.బాదం లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ ఈ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవి కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.కంటి చూపును పెంచుతాయి.

అలాగే కంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి.పిస్తా పప్పు( pistachio nut ) ఖరీదు కాస్త‌ ఎక్కువే అయినప్పటికీ.

నిత్యం వాటిని తీసుకుంటే కంటి చూపు షార్ప్ గా మారుతుంది.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

వాల్ నట్స్ కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వాల్ నట్స్( Wall nuts ) లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వయసు సంబంధిత నష్టం నుండి కళ్ళను కాపాడతాయి.నేత్ర సంరక్షణకు సహాయపడే మరొక డ్రై ఫ్రూట్ ఎండిన ఆప్రికాట్లు( Dried apricots ).వీటిలో విటమిన్ ఎ రిచ్ గా ఉంటుంది.డ్రై ఆప్రికాట్స్ ను నిత్యం తీసుకుంటే మంచి దృష్టిని ప్రోత్సహిస్తాయి.

Advertisement

అదే సమయంలో నైట్ బ్లైండ్ నెస్ వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తాయి.

ఇక కంటి ఆరోగ్యం కోసం బ్రెజిల్ నట్స్ ను కూడా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం మరియు ఇతర పోషకాలు కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.కంటి చూపును పెంచుతాయి.

మరియు కంటి శుక్లం నుంచి సైతం రక్షిస్తాయి.

తాజా వార్తలు