రెగ్యుల‌ర్‌గా ఈ వ్యాయామాలు చేస్తే..బ‌రువు ఈజీగా త‌గ్గుతార‌ట‌!?

ఈ మ‌ధ్య కాలంలో త‌మ బ‌రువును తామే మోసుకోలేక చాలా మంది నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇక‌ ఎవ‌రో ఒక‌రు చెప్పే వ‌ర‌కు తాము బ‌రువు పెరిగామ‌న్న విష‌యాన్నే గ‌మ‌నించ‌ని వారు ఎంద‌రో.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరుగుతూ ఉంటారు.ఈ అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎంత నిర్ల‌క్ష్యం చేస్తే.

ప్రాణాల‌కు ముప్పు అంత పెరుగుతుంది.అందుకే వెయిట్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం ఎంతో ముఖ్యం.

ఇక వెయిట్ లాస్‌లో స‌రైన డైట్‌తో పాటుగా వ్యాయామాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు.అయితే వ్యాయామాల్లోనే కొన్ని వ్యాయామ‌లు బ‌రువు వేగంగా మ‌రియు స‌ల‌భంగా త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement
These Exercises To Reduce Weight Very Fast! Exercises, Reduce Weight, Weight Los

మ‌రి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.స్కిప్పింగ్.

ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యేలా చేయ‌డంలో ఇది గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు క‌నీసం ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు త్వ‌ర‌గా క‌రిగి.

బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.

These Exercises To Reduce Weight Very Fast Exercises, Reduce Weight, Weight Los

వేగంగా బ‌రువు త‌గ్గేందుకు స్విమ్మింగ్ కూడా సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.రెగ్యులర్‌గా ఒక అర గంట పాటు స్విమ్మింగ్ చేస్తే.మంచి ఫ‌లితాల‌ను మీరే గ‌మ‌నిస్తారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అలాగే స్విమ్మింగ్ వ‌ల్ల మ‌న‌సు ప్ర‌శాంత‌గా మారుతుంది.గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

Advertisement

నిద్ర బాగా ప‌డుతుంది.

జుంబా కూడా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేందుకు మంచి వ్యాయామంగా చేప్పుకోవ‌చ్చు.అందుకే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది జుంబాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.న‌డ‌క ద్వారా కూడా ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చు.

అవును, ప్ర‌తి రోజు ఒక గంట పాటు న‌డ‌వ‌డం వ‌ల్ల శరీరంలోని కేలరీలు కరిగిపోయి వెయిట్ లాస్ అవుతారు.న‌డ‌క ఎంతో సులువైన వ్యాయామం కూడా.

తాజా వార్తలు