పిల్ల‌ల ఎముక‌లకు బలానిచ్చే అద్భుత‌మైన ఆహ‌రాలు ఇవే!

శ‌రీరంలో ఎముక‌లు ఎంతటి కీల‌క పాత్ర‌ను పోషిస్తాయో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.అయితే పెద్దవారితో పోలిస్తే పిల్ల‌ల ఎముక‌లు చాలా సున్నితంగా ఉంటాయి.

వాటిని దృఢంగా మార్చాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులదే.అందుకోసం ఇప్పుడు చెప్ప‌బోయే అద్భుత‌మైన ఆహారాల‌ను పిల్ల‌ల డైట్‌లో చేరిస్తే స‌రిపోతుంది.

దాంతో వారి ఎముకలు బ‌లంగా మార‌తాయి.ఫ‌లితంగా వారి ఎదుగుద‌ల ఉత్త‌మంగా సాగుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పిల్ల‌ల ఎముక‌ల‌కు బ‌లానిచ్చే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందం ప‌దండీ.ఖ‌ర్జూరాలు.

Advertisement

.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

చ‌క్క‌టి రుచితో పాటు ఎన్నో అమోఘ‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఖ‌ర్జూరాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఎముక‌ల దృఢ‌త్వానికి అవ‌స‌రం అయ్యే కాల్షియం ఖ‌ర్జూరాల్లో పుష్క‌లంగా ఉంటుంది.

అందువ‌ల్ల‌, పిల్ల‌ల చేత రోజుకు మూడు, నాలుగు ఖ‌ర్జూరాల‌ను తినిపించాలి.మఖానాలు.

వీటిని తామ‌ర గింజ‌లు అని కూడా పిలుస్తుంటారు.తెలుపు రంగులో న‌ల్ల‌టి మ‌చ్చ‌ల‌ను క‌లిగి ఉండే తామ‌ర గింజ‌ల ఖ‌రీదు కాస్త ఎక్కువే అయినా.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

ఆరోగ్య ప‌రంగా అందుకు త‌గ్గా ప్ర‌యోజ‌నాల‌ను ఇవి అందిస్తాయి.ముఖ్యంగా పిల్ల‌ల‌కు తామ‌ర గింజ‌ల‌తో త‌యారు చేసే వంట‌కాల‌ను త‌ర‌చూ ఇస్తే.

Advertisement

వారి ఎముక‌లు గ‌ట్టిగా మార‌తాయి.

రాగులు. సిరి ధాన్యాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే.రాగుల్లోనే ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.

అందులో కాల్షియం కూడా ఒక‌టి.అందుకే ఎదిగే పిల్ల‌ల‌కు రాగి పిండితో త‌యారు చేసే వంట‌ల‌ను ఇస్తే.

వారి ఎముకల సాంద్ర‌త పెరుగుతుంది.ఇక వీటితో పాటు పాలు, పెరుగు, జున్ను, బాదం, చియా సీడ్స్‌, ఆకుకూర‌లు, చేప‌లు వంటి ఆహారాల‌ను పిల్లల డైట్‌లో చేర్చాలి.

ఈ ఆహారాలు సైతం వారి ఎముకద దృఢ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు