శరీరంలో అధిక వేడిని తొలగించే అద్భుత పానీయాలు ఇవి.. తప్పకుండా తెలుసుకోండి!

శరీరంలో వేడి( Body heat ) ఎక్కువైందిరా.ఈ మాట ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో విని ఉంటారు.

అనే ఉంటారు.అంతర్గత మరియు బాహ్య ప్రభావాల కారణంగా శరీర వేడి పెరుగుతుంది.

శరీరంలో అధిక వేడి కారణంగా తీవ్రమైన తలనొప్పి, వికారం, నీరసం, అలసట, మైకం, అధిక చెమటలు, హార్ట్ బీట్ పెరిగిపోవడం, కళ్ళు మంటలు, రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం.ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.

శరీరంలో అధిక వేడిని తొలగించడానికి ఎటువంటి మందులు లేవు.కానీ కొన్ని అద్భుత పానీయాలు ఉన్నాయి.

Advertisement

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్ర మందారం టీ.( Red Hibiscus Tea ).శరీరంలో ఎంతటి వేడినైనా ఇది ఇట్టే మాయం చేస్తుంది.రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఎర్ర మందారం టీను తీసుకుంటే వేడి ఎక్కువ అయింది రా అన్న మాటే అనరు.

పైగా ఎర్ర మందారం టీ వ‌ల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ టీ వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడుతుంది.నిద్రలేమిని దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

అలాగే కొబ్బరి నీళ్లు( Coconut water ) కూడా శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది.ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( Lemon juice ) కలిపి తీసుకుంటే బాడీ దెబ్బకు కూల్ అయిపోతుంది.వేడి మొత్తం ఎగిరిపోతుంది.

Advertisement

ఇక ఒక‌ గ్లాసు తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు మ‌రియు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

ఇలా చేసినా కూడా శరీరంలో వేడి మొత్తం తొలగిపోతుంది.పైగా ఈ వాటర్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిస్తుంది.

బాడీని డీటాక్స్ చేస్తుంది.అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే నయం అవుతుంది.

తాజా వార్తలు