ఈ ఇయర్ లో భారీ విజయాలను సాదించిన టాప్ 3 ఇండియన్ సినిమాలు ఇవేనా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తనదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక 2024వ సంవత్సరంలో టాప్ 3 సక్సెస్ ఫుల్ సినిమాల లిస్టును కనక మనం చూసుకున్నట్లైతే ఇందులో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించి నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది.

ఇక ఇప్పటివరకు దాదాపు 1700 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా ఇంకా కూడా భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా( Kalki movie ) భారీ విజయాన్ని సాధించడమే కాకుండా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లను రా ఈ ఇయర్ లోనే రెండోవ అతిపెద్ద సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే అత్యుత్తమమైన సూపర్ హిట్ సినిమాగా నిలిచిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో నాగ్ అశ్విన్ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారాడు.

ఇక ఈ ఇయర్ లో మూడోవ ది బెస్ట్ ఇండియన్ సినిమాకి నిలిచిన సినిమా స్త్రీ 2( stree2 ) ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను కూడా అలరిస్తూ మంచి విజయాన్ని సాధించింది.మొదటి పార్ట్ ఎంత విజయాన్నైతే సాధించిందో దానికి మించి సెకండ్ పార్ట్ భారీ విజయాన్ని సాధించడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీకి కొంతవరకు కలసి వచ్చిందనే చెప్పాలి.

Advertisement

ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా అక్కడి స్టార్ హీరోల సినిమాలు మాత్రం సక్సెస్ లను సాధించడం లేదు.మరి బాలీవుడ్ స్టారర్ హీరోలు ఇక మీదటైన భారీ విజయాలను సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

పెళ్లి తర్వాత హ్యాపీగా లేము... ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అమర్ తేజు... ఆ వార్తలను నిజం చేస్తారా?
Advertisement

తాజా వార్తలు