బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!

అధిక బ‌రువు అనేది నేటి కాలంలో కోట్లాది మంది అతి పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

ఓవ‌ర్ వెయిట్ వ‌ల్ల ఆరోగ్యం చెడిపోవ‌డ‌మే కాకుండా ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర‌వుతుంటాయి.

ఈ క్ర‌మంలోనే బ‌రువు త‌గ్గాల‌ని భావిస్తుంటారు.అయితే అలాంటి వారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి.

బరువు తగ్గడం అంటే తిన‌డం మానేయ‌డం కాదు.సరైన సమతుల్యతతో ఆహారాన్ని తీసుకోవ‌డం.

ఉద‌యం అల్పాహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎంచుకోవాలి.ఉదాహ‌ర‌ణ‌కు ఓట్స్, పండ్లు, చియా సీడ్స్(Oats, fruits, chia seeds) కలిపిన కూరగాయలు, ఉడకబెట్టిన గుడ్లు.

Advertisement
These Are The Things Who Want To Lose Weight Should Definitely Know! Weight Loss

అలాగే సమతుల్యమైన భోజనం తినండి.ప్రతి భోజనంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

ప్రోటీన్ కోసం చికెన్, చేపలు, పెరుగు, పప్పులు, టోఫు త‌దిత‌ర ఆహారాల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.బ్రౌన్ రైస్, క్వినోవా, జొన్న రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

హెల్తీ ఫ్యాట్స్ కోసం బాదం, వేరుశెనగలు, అవ‌కాడో, నువ్వుల నూనె త‌దిత‌ర ఆహారాల‌ను ఎంచుకోండి.ఇక పోషకమైన స్నాక్స్ ను తీసుకోండి.

These Are The Things Who Want To Lose Weight Should Definitely Know Weight Loss

బ‌రువు త‌గ్గాలంటే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే స్వీట్స్, కేకులు (Sweets, cakes)తీసుకోవ‌డం మానుకోవాలి.రోజుకి కనీసం 8 గ్లాసులు నీరు తాగండి.సోడాలు మరియు చక్కెర కలిగిన పానీయాలు తీసుకోవడం తగ్గించండి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ప్యాకేజ్డ్ ఆహారాలు మరియు సాస్‌లను ఎవైడ్ చేయండి.టీవీ లేదా ఫోన్(TV or phone) చూసేటప్పుడు కాకుండా, తినే సమయంలో ఆహారం పై దృష్టి పెట్టండి.

Advertisement

ఆకలి ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తినండి.

మంచి ఆహారం తీసుకోవ‌డంతో పాటు నిత్యం వ్యాయామం చేయాలి.మీ శారీరక సామర్థ్యాన్ని బట్టి వ్యాయామం ఎంచుకోండి.రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామానికి సమయం కేటాయించండి.

వ్యాయామం చేయడం అనేది కేవలం కేల‌రీలు త‌గ్గ‌డం కోసం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం మెరుగుప‌డ‌టం కోసం కూడా అవసరం.అంతేకాకుండా కంటి నిద్ర మరియు ఒత్తిడి నియంత్రణ కూడా బరువు తగ్గడంలో కీలకంగా ఉంటాయి.

తాజా వార్తలు