అయోధ్యలో శ్రీ రాముని దర్శనానికి.. భక్తులు పాటించాల్సిన ప్రత్యేకమైన నియమాలు ఇవే..!

భారతదేశంలో సప్తపురాణాలుగా పేర్కొనే ఏడు పవిత్ర నగరాలు ఉన్నాయి.అయితే ఇవి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.

ఈ జాబితాలో మధుర, ద్వారక, వారణాసి, హరిద్వార్, ఉజ్జయిని, కాంచీపురం తో పాటు అయోధ్య కూడా ఉంది.ప్రస్తుతం అయోధ్య( Ayodhya ) రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతుంది.

ఇక వివాదాస్పద భూమిగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది అయోధ్య.ఇప్పుడు ఒక చారిత్రాత్మక క్షణానికి వేదిక కాబోతోంది అయోధ్య.

ఇక జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:15 నుండి 12:45 గంటల మధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది.అయితే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో ఇప్పటికి రామాలయం నిర్మాణం జరుగుతుంది.

Advertisement

అయితే చాలామంది భక్తులు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతున్నారు.

అయితే రాములవారి దర్శనానికి వెళ్లే భక్తులు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని అధికారులు తెలిపారు.ఆ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ మందిరం సముదాయంలోకి అడుగుపెట్టే వారికి చాలా కఠినమైన భద్రత చర్యలు ఉంటాయి.

ఆలయ ప్రాంగణంలోకి ఇయర్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, వాచ్ లు, రిమోట్ కీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు.ఇక ప్రజలు సాంస్కృతిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి.

ఇక ఈ పవిత్ర స్థలం పవిత్రతను కాపాడేందుకు ఆలయ నిబంధనలు అనుసరించాలి.అనేక దేవాలయాలు సందర్శకుల ప్రవేశానికి కఠినమైన డ్రెస్ కోడ్ ను కూడా అమలు చేస్తున్నాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
కేదార్‌నాథ్‌కు హెలీ సర్వీస్.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండిలా...

అయోధ్యలోని రామ మందిరాన్ని పర్యవేక్షిస్తున్న రామ్ మందిర్ ట్రస్ట్ నిర్దిష్ట దుస్తులకు తప్పనిసరి చేయలేదు.

Advertisement

అయితే ఈ అంశంలో భక్తులకు( Devotees ) ఫ్లెక్సిబిలిటీ కల్పించడం జరిగింది.అయితే జెండర్ లేదా వయసుతో సంబంధం లేకుండానే భారతీయ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించిన వారికి మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది.అయితే దీనిపై రామ్ మందిర్ ట్రస్ట్ ఇన్చార్జ్ అధికారి ప్రకాష్ గుప్తా( Prakash Gupta ) మాట్లాడుతూ.

భక్తులకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఏది లేదని.కానీ శరీర భాగాలు కనిపించకుండా మహిళలు దుస్తులు ధరిస్తే బాగుంటుందని సూచించారు.

ఇక మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా శరీర భాగాలు కనిపించకుండా శరీరాన్ని పూర్తిగా కప్పుకొని ఉండే విధమైన వస్తువులను ధరించి రామదర్శనానికి రావాలని పేర్కొన్నారు.

తాజా వార్తలు