కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే!

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు( kidneys ) ఒకటి.

రక్తం నుండి వ్యర్థాలు, టాక్సిన్ల‌ను ఫిల్టర్ చేయడం, లోపలి శరీరాన్ని శుభ్రంగా ఉంచడం కిడ్నీల పని.

కిడ్నీల పనితీరు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది.లేదంటే శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.కిడ్నీ సంబంధిత వ్యాధులకు( kidney related diseases ) దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

అందుకు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These Are The Rules To Follow If You Want To Avoid Kidney Diseases Kidney Disea
Advertisement
These Are The Rules To Follow If You Want To Avoid Kidney Diseases! Kidney Disea

బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.అప్పుడే కిడ్నీల పనితీరు బాగుంటుంది.అందుకోసం నిత్యం రెండు నుంచి మూడు లీటర్లకు తగ్గకుండా వాటర్ తీసుకోవాలి.

అలాగే నిత్యం వ్యాయామం చేయాలి.కనీసం ముప్పై నిమిషాలు అయినా వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలా మీకు నచ్చిన ఏదో ఒక వ్యాయాయాన్ని ఎంచుకుని చేస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా మారతారు.

అనేక జబ్బులకు దూరంగా ఉంటారు.

These Are The Rules To Follow If You Want To Avoid Kidney Diseases Kidney Disea

డైట్ లో తాజా కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలు( Vegetables, seasonal fruits, greens ), నట్స్, సీడ్స్, తృణధాన్యాలు వంటి ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.పాలు, పెరుగు, ప‌న్నీర్ వంటి డైరీ ప్రోడెక్ట్స్ ను మితంగా తీసుకోండి.ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఉడికి ఉడకని మాంసం అస్సలు తీసుకోరాదు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఉప్పు వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి.ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అల‌వాట్లు ఉంటే మానుకోండి.

Advertisement

చాలా మంది ఈ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ వేసుకుంటారు.ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు.

అధికంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది.క్రమంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి.

కాబట్టి పెయిన్ కిల్లర్స్ ను ఎవైడ్ చేయండి.అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోండి.

ఇక 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాది కిడ్నీ చెకప్ చేయించుకోండి.

తాజా వార్తలు