టమాట సాగులో అధిక దిగుబడి కోసం అనువైన రకాలు ఇవే..!

వ్యవసాయ రంగంలో ఎరువులు, నీటి యజమాన్యం, మేలు రకం విత్తనాలు అనేవి చాలా కీలకం.

వీటితో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.

టమాటా పంటను( Tomato crop ) ఏడాది పొడవునా ఎప్పుడైనా సాగు చేయవచ్చు.కాకపోతే అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం, వడగాలుల వల్ల టమాటా మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు.

ఇక చీడపీడలు ఆశించిన పంట దిగుబడి తగ్గడంతో పాటు పెట్టుబడి వ్యయం అధికమవుతుంది.అయితే విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుని సాగు చేస్తే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుంది.

మేలు రకం టమాట విత్తనాలు ఏమిటో చూద్దాం.అర్క వికాస్: ( Arka Vikas )వేసవికాలంలో ఈ రకం విత్తనాలు సాగుకు చాలా అనుకూలం.పండ్ల పరిమాణం పెద్దగా, గుండ్రంగా ఉంటాయి.

Advertisement
These Are The Ideal Varieties For High Yield In Tomato Cultivation, Tomato Culti

ఈ రకం విత్తిన 110 రోజులకు పంట చేతికి వస్తుంది.ఒక ఎకరానికి 16 టన్నుల దిగుబడి పొందవచ్చు.

పి.కె.యం-1: ( P.K.Yam-1 )ఈ రకం విత్తనాలను ఏడాదిలో ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.మొక్కలు చిన్నవిగా ఉండటంవల్ల పొలంలో ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు.

విత్తిన 13 రోజులకు పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 12 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

These Are The Ideal Varieties For High Yield In Tomato Cultivation, Tomato Culti

పూసా ఎర్లీడ్వార్ఫ్:( Pusa Earlydwarf ) వర్షాకాలం, వేసవికాలం లో సాగుకు ఈ విత్తనాలు అనుకూలం.పండ్ల పరిమాణం మధ్యస్థ స్థాయిలో ఉంటు రంగు తేలికపాటి ఎరుపు రంగులో ఉంటుంది.విత్తిన 60 రోజులకు కాపు వస్తుంది.

పూసా సదా బహార్:( Pusa Sada Bahar ) ఈ రకం సాగుకు ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండాలి.ఒక ఎకరం పొలంలో 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.

These Are The Ideal Varieties For High Yield In Tomato Cultivation, Tomato Culti
Advertisement

అర్క మేఘాలి: ( Arka Meghali )ఈ రకం ను వర్షాధార పంటగా సాగు చేయవచ్చు.మిగతా రకాలతో పోలిస్తే నీటి అవసరం కాస్త తక్కువ.పంట కాలం 130 రోజులు.

ఒక ఎకరంలో 8 టన్నుల దిగుబడి పొందవచ్చు.అర్క రక్షక్:( Arka Rakshak ) ఈ రకం వివిధ రకాల తెగుళ్లను తట్టుకునే శక్తిని కలిగి ఉన్న ఉత్తమమైన రకం.పంటకాలం 140 రోజులు.ఒక ఎకరంలో దాదాపుగా 30 టన్నుల దిగుబడి పొందవచ్చు.

తాజా వార్తలు