వేరుశ‌న‌గ‌ల‌తో క‌లిపి తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

వేరుశ‌న‌గ‌లు( Peanuts ) లేదా ప‌ల్లీలు.దాదాపు అంద‌రి వంటింట్లో ఉంటాయి.

వేరుశ‌న‌గ‌ల‌ను ప్ర‌ధానంగా చ‌ట్నీలు, క‌ర్రీలు, తాలింపుల‌కు ఉప‌యోగిస్తారు.

వాటితో రుచిక‌ర‌మైన స్నాక్స్ త‌యారు చేస్తుంటారు.

వంట‌ల కోసం వేరుశ‌న‌గ‌ల‌తో నూనె కూడా త‌యారు చేస్తుంటారు.ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఆరోగ్య‌ప‌రంగా వేరుశ‌న‌గ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

గుండె ఆరోగ్యానికి మెరుగుప‌రచ‌డంలో, ర‌క్త‌హీన‌త నివార‌ణ‌లో, శ‌రీర బ‌రువును నియంత్రించ‌డంలో, ప్రోటీన్ కొర‌త‌కు చెక్ పెట్ట‌డంలో వేరుశ‌న‌గ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే పోషకవిలువలతో కూడిన ఆహారం అయినప్పటికీ, కొన్ని ఆహారాలను వేరుశ‌న‌గ‌ల‌తో కలిపి తినడం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండకపోవచ్చు.

Advertisement
These Are The Foods You Should Not Eat With Peanuts Details, Peanuts, Peanuts He

ఈ జాబితాలో పాలు( Milk ) మ‌రియు పాల పదార్థాల గురించి ముందు చెప్పుకోవాలి.పాలు, పెరుగు, చీజ్, వెన్న వంటి ఫుడ్స్ ను వేరుశ‌న‌గ‌ల‌తో పాటుగా లేదా ఒకేసారి తీసుకోకూడ‌దు.

ఎందుకంటే, వేరుశనగ‌ల్లో ప్రోటీన్లు, పాలలోని క్యాల్షియంతో రియాక్ట్ అయ్యి జీర్ణ సమస్యల‌కు దారితీస్తాయి.

These Are The Foods You Should Not Eat With Peanuts Details, Peanuts, Peanuts He

కొంద‌రు సాయంత్రం వేళ‌లో ప‌ల్లీల‌ను స్నాక్స్ గా తింటూ ఉంటాయి.ఆ వెంట‌నే టీ లేదా కాఫీ తాగుతుంటాయి.అయితే వేరుశనగలు మ‌రియు టీ లేదా కాఫీను ( Tea or Coffee )ఒకేసారి తీసుకుంటే బాడీలో ఐరన్ అబ్సార్బ్షన్ త‌గ్గిపోవ‌చ్చు.

ఫ‌లితంగా ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌తారు.ఆకుకూర‌లు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటి హై-ఫైబ‌ర్ ఫుడ్స్ లో వేరుశ‌న‌గ‌లు క‌లిపి తీసుకోకూడ‌దు.వేరుశ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.

ఎర్ర కందిప‌ప్పుతో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?
చిరంజీవి సినిమా వల్ల నా వ్యాధి బయటపడింది.. వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ రీల్!

వీటిని అధిక ఫైబ‌ర్ తో క‌లిపి తీసుకుంటే కొంద‌రికి గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం త‌దిత‌ర‌ సమస్యలు రావచ్చు.

These Are The Foods You Should Not Eat With Peanuts Details, Peanuts, Peanuts He
Advertisement

వేరుశనగలు మ‌రియు గోధుమల కలయిక కూడా మంచిది కాదు.ఈ కాంబినేష‌న్ జీర్ణకోశంపై భారం కలిగించి తీవ్ర‌మైన అసౌక‌ర్యానికి గురి చేస్తుంది.కాబ‌ట్టి, గోధుమ ఆహారాల‌తో వేరుశ‌న‌గ‌లు క‌లిపి తీసుకోకండి.

ఇక వేరుశ‌న‌గ‌ల‌ను తిన్న వెంట‌నే నీరు కూడా తాగ‌కూడ‌దు.వేరుశ‌న‌గ‌లు కొవ్వు మరియు ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటాయి, ఇవి జీర్ణమయ్యేందుకు కొంత సమయం పడుతుంది.

వెంటనే నీరు తాగితే జీర్ణ రసాలు తక్కువగా ఉత్పత్తి అయ్యి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.దాంతో అజీర్ణం, క‌డుపు ఉబ్బ‌రం, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

తాజా వార్తలు