1.గురుద్వారా హర్మిందర్ సాహిబ్ సింగ్, పంజాబ్అమృత్‌సర్‌లోని ఈ గురుద్వారా హర్మిందర్ సాహిబ్ సింగ్‌ను దర్బార్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
ఈ గురుద్వారా చాలా అందంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఇది భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరొందింది.
మత విశ్వాసాల ప్రకారం ఈ గురుద్వారాను రక్షించడానికి మహారాజా రంజిత్ సింగ్ దాని పైభాగాన్ని బంగారంతో తాపడం చేయించారు.అందుకే దీనికి గోల్డెన్ టెంపుల్ అని కూడా పేరు పెట్టారు.గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్, ఉత్తరాఖండ్గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది.
ఈ గురుద్వారా సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంది.మంచు కారణంగా, ప్రయాణికుల భద్రత కోసం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మూసివేస్తారు.
ఈ గురుద్వారా చాలా అందంగా ఉండటమే కాకుండా, చాలా మంచి నిర్మాణ కళకు ఉదాహరణగా నిలిచింది.హజూర్ సాహిబ్ గురుద్వారా, మహారాష్ట్రహజూర్ సాహిబ్ సిక్కుల 5 తఖ్త్‌లలో ఒకటి.ఇది మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో గోదావరి నది ఒడ్డున ఉంది.
ఈ గురుద్వారాను సచ్ ఖండ్ అని అంటారు.గురుద్వారా లోపలి గదిని అంగీతా సాహిబ్ అంటారు.
1708లో ఈ ప్రదేశంలో గురుగోవింద్ సింగ్‌ను దహనం చేశారని చెబుతారు.ఈ గురుద్వారా మహారాజా రంజిత్ సింగ్ ఆదేశాల మేరకు 1832-1837 మధ్య నిర్మించబడింది.4.గురుద్వారా పవోంటా సాహిబ్, హిమాచల్ ప్రదేశ్పవోంటా సాహిబ్ గురుద్వారా పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్‌కు అంకితమయ్యింది.ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఉంది.
ఈ ప్రదేశంలో గురు గోవింద్ సింగ్ తన జీవితంలో నాలుగు సంవత్సరాలు గడిపారు.ఈ ప్రదేశంలో ప్రముఖ గ్రంథాన్ని రచించాడు.
గురుద్వారాలో ఒక మ్యూజియం ఉంది.దానిలో గురువు ఉపయోగించిన పెన్నులు, ఆ కాలంలో వాడిన ఆయుధాలను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy