Back Pain :వెన్ను నొప్పిని వేగంగా దూరం చేసే వ్యాయమాలు ఇవే..!

ప్రస్తుత రోజులలో చాలా మందిలో వెన్ను నొప్పి అనే సమస్య సాధారణంగా మారిపోయింది.వెన్నునొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవారికి ఈ వెన్నునొప్పి అనేది ఎక్కువగా వస్తుంది.గంటలు గంటలు ఆఫీస్‌లో కూర్చోవడం వల్ల వెన్నునొప్పి ఎక్కువగా వస్తుంది.

ఈ సమస్య ఉంటే ఎక్కువగా కూర్చోవడం, నిద్రపోవడం, నడవడం, వంగడం వంటి రోజు వారి పనులు చేయడం ఎంతో కష్టంగా మారుతుంది.ముందుగానే ఈ వెన్ను నొప్పి( Back Pain )ని గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు
.

These Are The Exercises That Get Rid Of Back Pain Fast

అయితే ఇలా వెన్నునొప్పి( Back pain )తో బాధపడేవారు చికిత్స చేయించుకోవడానికి ముందు ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయమాలు చేసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది.ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే థొరాసిక్ స్ట్రెచ్ వ్యాయామం( Thoracic Spine Stretches ) చేయడానికి ముందుగా నేల పై కూర్చోవాలి.

Advertisement
These Are The Exercises That Get Rid Of Back Pain Fast-Back Pain :వెన్�

ఫోమ్ రోలర్‌ను తీసుకుని వెనుక భాగంలో ఉంచి దాని పై పడుకోవాలి.ఆ తర్వాత మెల్లగా కాళ్లు చాచి మెడ తల నేలపై ఉండేలా చూసుకోవాలి.ఫోమ్ రోలర్ కరెక్టుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

These Are The Exercises That Get Rid Of Back Pain Fast

ఫోమ్ రోలర్‌( Foam Roller )ను కరెక్ట్ గా పెట్టుకుంటేనే మీకు నొప్పి తగ్గిపోతుంది.ఆ తర్వాత డీప్ బ్రీత్ తీసుకోనీ శరీరాన్ని ముందుకు వెనక్కి అటు ఇటు స్ట్రెచ్ చేయాలి.ఇలా చేయడం వల్ల మీ వెనుక కండరాలను సాగదీసి నొప్పిని తగ్గిస్తుంది.

అలాగే ఓపెనింగ్ చెస్ట్ వ్యాయామం చేయడానికి రెండు కుర్చీలను మీకు రెండు వైపులా చేతులు అందుకోగలిగినంత దూరంలో ఉంచాలి.ఇప్పుడు వీటి మధ్య మోకాలు వేసి కూర్చోవాలి.

ఆ తర్వాత రెండు చేతులను విస్తరించి 90 డిగ్రీల కోణంలో ఉండేలా కుర్చీలపై చేతులు ఉంచాలి.ఈ చేతులను కాస్త పైకి లేపి ముందుకు కాస్త వంగాలి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మరింత ముందుకు వంగాలి.ఆ తర్వాత నార్మల్ పొజిషన్‌కు వచ్చేయాలి.

Advertisement

అయితే ఇలా చేస్తే చాతిలో ఉండే నొప్పి కూడా తగ్గిపోతుంది.అంతేకాకుండా వెన్నునొప్పి కూడా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు