ఈ సంవత్సరంలో ఆఖరి శని అమావాస్య రోజు చేయాల్సిన పరిహారాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే గోచారస్థితి ఫలితంగా ఏలినాటి, శని, అష్టమ శని, అర్ధాష్టమ శని( Ardhashtama Shani ) ఉంటాయి.

శని ప్రభావం ఉంటే తన అన్న యముడిని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని పండితులు చెబుతున్నారు.

అందుకే శని నుంచి ఎవరూ తప్పించుకోలేరు.కానీ ఆ ప్రభావం తగ్గించుకునేందుకు శనిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని శ్లోకాలు పాటించడం, కొన్ని పరిహారాలు చేయడం మంచిది అని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాలలో శని సంచరించే కాలన్నీ ఏలినాటి శని అని అంటారు.ఈ మూడు రాశులలో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనినే ఏలినాటి శని అని అంటారు.

జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అని అంటారు.రాజకీయ,వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబ సమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు, వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్థానాచలనం సమస్యలు, వాహన ప్రమాదాలు, తల్లికి అనారోగ్యం ఏర్పడుతుంది.

Advertisement

అలాగే జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని( Ashtama Shani ) అని అంటారు.ఈ సమయంలో ఉద్యోగంలో ఆటంకాలు, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.

శత్రు బాధలు, ఊహించని నష్టాలు వస్తాయి.

అలాగే జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అని పిలుస్తారు.దీని వల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.శని అమావాస్య పరిహారాలు ఇలా చేయాలి.

శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.ఏలినాటి శని, అష్టమ శని దోషం తగ్గించుకునేందుకు దేవాలయాలలో శనికి నువ్వుల నూనె ( Sesame oil )నల్లటి వస్త్రం సమర్పించాలి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఈ రోజు పితృ తర్పణాలు,( Pitru Tarpanam ) నదులు, సరస్సుల్లో స్నానం చేసి ధన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.శ్రమ జీవులైన చీమలకు ఆహారం వేయడం, పశువులకు దాహం తీర్చడం లాంటివి చేస్తే మంచిది.

Advertisement

కనీసం తలకి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని శనీ శ్లోకాలను చదువుకున్న కొంత వరకు గ్రహ దోషాల( Grah Dosh ) నుంచి విముక్తి పొందవచ్చు.

తాజా వార్తలు