కంటి చూపుకు అండగా ఉండే సూపర్ ఫుడ్స్ ఇవి.. మీ డైట్ లో ఉన్నాయా?

ప్రస్తుత ఆధునిక కాలంలో కంప్యూటర్ ముందు పని చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది.

పిల్లల నుండి ముసలి వారి వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్( Smart phone ) దర్శనమిస్తోంది.అయితే స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మొదట ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు.

ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది.దీంతో కళ్లద్దాలపై ఆధారపడుతున్నారు.

అందుకే కంటి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల‌ని నిపుణులు చెతున్నారు.అయితే కంటి చూపుకు అండగా ఉండే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.

Advertisement

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి కూర ( Lettuce, Spinach )కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పాల‌కూర‌, బ‌చ్చ‌లికూర‌లో విటమిన్‌ ఇ , విట‌మిన్ ఎ, విటమిన్ బి, విట‌మిన్‌ సి, ఐరన్, జింక్ వంటి పోష‌కాల‌తో పాటు లుటిన్ మరియు జియాక్సంతిన్ ( lutein and zeaxanthin )వంటి ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అందువల్ల వారానికి రెండు సార్లు ఈ ఆకుకూరలు తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది.

కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అలాగే డ్రై ఫ్రూట్స్ కంటి ఆరోగ్యానికి అండగా ఉంటాయి.కంటిచూపును మెరుగు పరుస్తాయి.రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )తినడం వల్ల కళ్లద్దాల పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

రాజమౌళి ఆ విషయం లో మాత్రం ఎవ్వరూ చెప్పిన అసలు వినిపించుకోడట...
దుష్టశక్తులు మీ ఇంటిని వదిలిపోవాలంటే ఈ పనులు చెయ్యండి!

కంటి చూపును మెరుగుపరిచే సత్తా ఆరెంజ్ పండ్లకు ఉంటుంది.కంటి రెటీనా కు అవసరమయ్యే విటమిన్ ఎ ఆరెంజ్ పండ్లలో మెండుగా ఉంటుంది.

Advertisement

కంటి ఆరోగ్యానికి పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఒక సూప‌ర్ ఫుడ్ అని చెప్పుకోవ‌చ్చు.పొద్దుతిరుగుడు విత్త‌నాల్లో పుష్క‌లంగా ఉండే విటమిన్ ఇ కంటిలోని కణాలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్.అందువ‌ల్ల రోజుకు రెండు స్పూన్లు ఈ విత్త‌నాల‌ను తీసుకుంటే కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరం ఉండొచ్చు.

అలాగే కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలు తృణధాన్యాల్లో స‌మృద్ధిగా ఉంటాయి.ఆక్సీకరణ నష్టం మరియు వాపు నుండి కళ్ళను రక్షించడంలో తృణధాన్యాలు స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్వినోవా, పప్పులు, ఓట్స్ మరియు బ్రౌన్ రైస్ తినండి.

ఇక ఇవే కాకుండా బ్రోకలీ, క్యాప్సికమ్, క్యారెట్, గుడ్డు, చేపలు వంటి ఆహారాలు కూడా కంటి చూపును పెంచుతాయి.

తాజా వార్తలు