వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

సాధారణంగా చాలామందికి బాడీ మొత్తం ఒక రంగులో ఉంటే మోచేతులు మాత్రం నల్లగా కనిపిస్తుంటాయి.

మోచేతులు నల్లగా( Dark Elbows ) మారడానికి చాలా కారణాలే ఉన్నాయి.

ఏదేమైనా ఆ నలుపును పోగొట్టుకునేందుకు కొందరు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

అయితే మోచేతుల నలుపును వదిలించడానికి కొన్ని ఇంటి చిట్కాలు కూడా సూపర్ గా పని చేస్తాయి.అటువంటి కొన్ని సూపర్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టిప్‌-1:

మిక్సీ జార్ లో నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, పావు టీ స్పూన్ తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మోచేతలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

Advertisement

ఆపై 15 నిమిషాలు మోచేతుల‌ను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే రిజ‌ల్ట్‌ గమనిస్తారు.

ఈ రెమెడీ మోచేతుల నలుపు క్రమంగా తగ్గిస్తుంది.అక్క‌డి చర్మాన్ని తెల్లగా మృదువుగా మారుస్తుంది.

టిప్ 2:

ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీ కూడా మోచేతుల నలుపును పోగొడుతుంది.చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.

ఇదేం విచిత్రం.. ఇన్‌ఫ్లుయెన్సర్ ఫొటోలు కటౌట్లుగా అమ్మకం.. ఆమెకు తెలిసి మైండ్ బ్లాక్!
డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా..హీరో అవ్వబోతున్నాడు

ఈ టిప్స్ ఫాలో అవ్వడంతో పాటు రెగ్యులర్ గా మోచేతులకు మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.అలాగే నైట్ నిద్రించే ముందు మోచేతులపై ఆల్మండ్ ఆయిల్ రాయండి.

Advertisement

త‌ద్వారా మెలానిన్ తగ్గి రంగు మెరుగవుతుంది.ఇక బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మోచేతుల‌కు కూడా స‌న్ స్క్రీన్ రాసుకోండి.

తాజా వార్తలు