ఇవి నిజమైనవి కాదు సుమా! బొమ్మలు అంతకంటే కాదు, మరేమిటో చూసేయండి?

అవును, వీటిని చూస్తే నిజమైనవిలాగే మనకు కనబడతాయి.కానీ నిజం కాదు.

పిల్లలు ఆడుకొనే బొమ్మలు లాగా ఉంటాయి.కానీ బొమ్మలు కావు.

మరేమిటని తెలుసుకోవాలని వుందా.అయితే ఈ కథ తెలుకోవలసిందే.

బేసిగ్గా పేస్ట్రీ చెఫ్​ అయిన అమౌరీ గిచొన్ ఫ్రాన్స్​లో పుట్టాడు.కొత్త రకం వంటలు చేయడం, ఫుడ్​ని అందంగా డెకరేట్ చేయడం మీద అతనికి మక్కువ ఎక్కువ కావడంతో చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోయేవాడు.

Advertisement
These Are Not Real Toys Are Nothing More Than That, Look No Further , Toy, Caco

దాంతో 14 ఏండ్లకే స్కూల్ కి టాటా చెప్పేసాడు.చిన్న పిల్లలకు మళ్లే ఇతనికి కూడా చాక్లెట్ అంటే మస్త్ ఇష్టం.

అయితే ఇతను అందరిలా చాక్లెట్లని తినడానికి పుట్టలేదు.అవును.

చాకోలెట్ రూపంలో వున్న పక్షులు, జంతువులు, వివిధ వాహనాలు, పరికరాల బొమ్మలు తయారుచేయడానికి పుట్టాడు మన అమౌరీ.ఈ క్రమంలో ఈమధ్యే చాక్లెట్​తో ఓ బైక్ బొమ్మ తయారుచేసి శెభాష్​ అనిపించుకున్నాడు.

ఇంకా అతను చాకొలేట్ తో చేసిన పెద్ద నత్త, పుట్టగొడుగు బొమ్మల ఫొటోలు, వీడియోలు కూడా సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తల్లిదండ్రులు కూడా అతడికి సపోర్ట్ ఇవ్వడంతో కలినరీ ఆర్ట్​లో 2 ఏళ్ళ కోర్సు పూర్తి చేశాడు.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!

తర్వాత వుల్ఫ్స్​ బర్గ్ కాలేజీలో ఓ 2 ఏళ్ళ పేస్ట్రీ కోర్స్​లో చేరాడు.ఆ వెంటనే మనోడికి ఒక బేకరీలో కేక్, పేస్ట్రీ డెకరేటర్​గా జాబ్ వచ్చింది.

These Are Not Real Toys Are Nothing More Than That, Look No Further , Toy, Caco
Advertisement

దాదాపు అలా 15 ఏళ్ళు పలు బేకరీల్లో కేక్​, పేస్ట్రీ డెకరేటర్​గా పని చేసి, ఫ్రాన్స్​లోనే కాకుండా అమెరికాలో కూడా పాపులర్​ పేస్ట్రీ చెఫ్​గా పేరు తెచ్చుకున్నాడు అమౌరీ.ఫ్రాన్స్​లో "వు విల్​ బి ది నెక్స్ట్​ గ్రేట్ పేస్ట్రీ చెఫ్" అనే టీవీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి, మూడో ప్లేస్​లో నిలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు.అనంతరం మూడేండ్ల క్రితం అమెరికాలోని లాస్​వెగాస్​లో సొంతంగా కేక్​, పేస్ట్రీ షాపు పెట్టాడు అమౌరీ.

ఆ షాప్​ కి "ది పేస్ట్రీ అకాడమీ" అని పేరు పెట్టాడు.అప్పటినుంచి కేక్​ల డెకరేషన్​తో పాటు చాక్లెట్లతో జంతువులు, పక్షులు, రకరకాల బొమ్మలు తయారు చేసి, తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాడు.

కావాలంటే చూసేయండి మరి.

తాజా వార్తలు