అక్క‌డ‌ వైసీపీ ఇలా.. టీడీపీ అలా.. హీటెక్కిన పాలిటిక్స్‌

అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ, టీడీపీ రాజ‌కీయాలు ర‌సవ‌త్త రంగా మారాయి.

టీడీపీకి కంచుకోట అయిన‌ ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య స‌హా ఉర‌వ‌కొండ నియో జ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

అయితే హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం పాలిటిక్స్ భిన్నంగా సాగుతున్నాయి.ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

వ‌రుస‌గా రెండో సారి కూడా బాల‌య్య విజ‌యం సాధించారు.అయితే.

ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చుట్ట‌పు చూపుగా మాత్ర‌మే వ‌స్తున్నారు.వ్యాపా రాలు షూటింగుల కార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గంపై ఫుల్లుగా దృష్టి పెట్ట‌లేక పోతున్నారు.

Advertisement
There YCP Is Like TDP Is Like Heated Politics-ap-ap Political News-latest New

దీంతో టీడీపీ నేత‌ల‌కు కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు.అయితే, వారు కూడా బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన‌ప్పుడు హ‌డావుడి చేస్తున్నారు.

మిగిలిన స‌మ‌యాల్లో మాత్రం ఎవ‌రిదారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ ‌రిస్తున్నారు.దీంతో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధి పెద్ద‌గా ఏమీ క‌నిపించ‌డం లేదు.

పైగా గ‌తంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు టీడీపీ నాయ‌కులు కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌డం లేదు.దీంతో ఒక విధ‌మైన గ్యాప్ స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఇటీవ‌ల బాల‌య్య ఇక్క‌డ ప‌ర్య‌టించిన స‌మ‌యంలోనూ గ్యాప్ స్ప‌ష్ట‌మైంది.అయితే బాల‌య్య ఈ విష‌యాన్ని గ‌మ‌నించలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

There Ycp Is Like Tdp Is Like Heated Politics-ap-ap Political News-latest New
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.టీడీపీలో ఉన్న లోటుపాట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందు కు సాగాల్సిన అధికార పార్టీలోవ‌ర్గ పోరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.గ‌త ఏడాదికాలంగా ఇక్క‌డ వ‌ర్గ రాజ‌కీయా లు సాగుతున్నాయి.

Advertisement

న‌వీన్ నిశ్చ‌ల్ వ‌ర్గం ఒక‌వైపు పార్టీలో సెప‌రేట్‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.మ‌రో వైపు ఎంపీ వ‌ర్గం విడిగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఇక్బాల్ కూడా త‌న‌కం టూ ప్ర‌త్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు.ఈ వ‌ర్గ పోరులో వైసీపీ రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మ‌లు పులు తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మొత్తంగాచూస్తే టీడీపీది ఒక దారి అయితే వైసీపీది మ‌రో దారి అన్న‌ట్టుగా ఉంది హిందూపురం రాజ‌కీయాల ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు