నాపై హత్యాయత్నం జరిగింది..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు.

ఈ మేరకు హత్యాయత్నంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్ఎస్జీ కమెండోలు మరియు మీడియా సాక్షిగా తనపై హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రభుత్వాన్ని విమర్శిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న చంద్రబాబు తప్పుడు ఆధారాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

అయితే ఇప్పటికే చంద్రబాబుతో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలపై హత్యాయత్నంతో పాటు నేరపూరిత కుట్ర కింద పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement
Validation Check 2026