ఆ దేశ జనాభా 27 మంది... ఆ బుల్లి దేశం సంగతులు తెలుసుకుందాం రండీ

ఒక దేశం అన్నప్పుడు అందులో రాష్ట్రాలు, జిల్లాలు, ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులు, విదేశాంగ శాఖ ఇలా ఎంతో మంది, ఎన్నో శాఖలు ఉండాల్సి ఉంటుంది.

కాని అవేవి లేకుండానే సీల్యాండ్‌ దేశం అయ్యింది.

అది కూడా కేవలం 27 మంది జనాబాతో ఉన్న ఆ ప్రాంతంను దేశంగా ప్రకటించారు.ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా సీల్యాండ్‌ క్రెడిట్‌ దక్కించుకుంది.

The Worlds Smallest Country 27-ఆ దేశ జనాభా 27 మంది#82

బ్రిటన్‌ ఆధీనంలో మొదట కొనసాగిన ఈ ప్రాంతం ఆ తర్వాత స్వయం ప్రతిపత్తిని దక్కించుకుంది.ప్రతి విషయంలో కూడా దీన్ని ఒక దేశంగా పరిగణిస్తూ వస్తున్నారు.

అక్కడ జనాబా తక్కువ ఉన్నా కూడా ఇంకా దేశంగానే కొనసాగుతూ వస్తోంది.కేవలం 27 మందితో కొనసాగుతున్న ఈ దేశంలో ప్రత్యేక కరెన్సీ అయితే ఏమీ లేదు.

Advertisement

అమెరికన్స్‌ వినియోగించే డాలర్లు ఈ దేశంలో వాడుతారు.ఇక ఈ దేశంలో ప్రత్యేకమైన కాయిన్స్‌ను వాడుతున్నారు.

ఆ కాయిన్స్‌ అక్కడ తప్ప మరెక్కడ కూడా వినియోగించరు.ఆ కాయిన్స్‌ను దేశంలో ఏ అవసరంకు అయినా వినియోగించుకోవచ్చు.

ఇక దేశ జనాబా తక్కువ ఉన్నా కూడా అక్కడ ప్రత్యేకమైన పోస్టల్‌ స్టాంప్‌ను వినియోగించడం జరుగుతుంది.ఈ చిన్న దేశం తూర్పు బ్రిటన్‌కు 7 మైళ్ల దూరంలో ఉంది.

ఈ దేశం సముద్రపు ఒడ్డున ఉంటుంది.ఒకప్పుడు ఆర్మీ వారు ఈ ప్రాంతంను కృత్రిమంగా నిర్మించడం జరిగింది.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

బ్రిటన్‌ ఆర్మీ ఆధీనంలో 1967 వరకు ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత స్వయం ప్రతిపాధికను పొందింది.అప్పుడు అక్కడ జనాబా వందల సంఖ్యలో ఉండేది.కాని ఆ తర్వాత పలు కారణాల వల్ల జనాబా తగ్గుతూ వచ్చింది.1975లో ఈ దేశంకు ప్రత్యేక రాజ్యాంగం, జాతీయ జెండా, కరెన్సీ, జాతీయ గీతం, పాస్‌పోర్ట్‌ కూడా అమలులోకి వచ్చింది.కేవలం 27 మంది మాత్రమే ఉన్న దేశంగా ఈమద్య కాలంలో సీల్యాండ్‌ వెలుగులోకి వచ్చింది.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చిన్న దేశాలు ఉన్నాయి.అయితే ఇంత తక్కువ జనాభా ఉన్న దేశం మాత్రం ఇదే.ఇలాంటి దేశాలను మైక్రో నేషన్స్‌ అంటారు.వీటికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉంటుంది.

తాజా వార్తలు