అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిమ్మకాయ.. వేలం వేసి విక్ర‌యిస్తారు!

మ‌న దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది.పెట్రోల్, డీజిల్‌తో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిమ్మకాయల ధరలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఎందుకంటే ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా నిమ్మకాయ ధర కిలో రూ.350 నుండి 450 రూపాయలకు చేరుకుంది.అయితే ఇప్పుడు మనం అత్యంత ఖ‌రీదైన నిమ్మ‌కాయ గురించి, దాని స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం.

ఈ నిమ్మకాయ గురించి తెలుసుకుంటే ఎవ‌రైనా షాక‌వ్వాల్సిందే.ఎందుకంటే మన దేశంలోని ఆ ప్రాంతంలో ల‌భించే ఆ నిమ్మ‌కాయ‌ ఖ‌రీదు అక్ష‌రాలా రూ.27,000.నిజానికి నిమ్మకాయ వాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మకాయలో మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి.వేసవి కాలంలో నిమ్మకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

Advertisement

దీని రసం శరీరంలోని అనేక రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది.దీనితో పాటు నిమ్మకాయ ప్రాముఖ్యత మత విశ్వాసాలతో కూడా ముడిప‌డివుంది.

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని మతపరమైన ప్రదేశాలలో నిమ్మకాయల‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.అందుకే ఈ ప్రాంతంలో నిమ్మకాయలు మార్కెట్‌లో తక్కువ ధరకు దొరుకుతుంటాయి.

ప్రస్తుతం ఈనిమ్మకాయ రికార్డులన్నీ బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.మనం తెలుసుకోబోతున్న‌ నిమ్మకాయ విలువ రూ.27,000.ఇంత ఖ‌రీదా అని ఆశ్ఛ‌ర్య‌పోతున్నారా? ఇది నిజం. తమిళనాడులోని విల్లుపురంలో గ‌ల ఒక దేవాలయంలో దేవుడికి సమర్పించే నిమ్మకాయ ధర 27,000 రూపాయలు.

ఆలయంలో 11 రోజుల పాటు జరిగే ఉత్స‌వం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ పండుగ ముగింపులో సమర్పించిన నిమ్మకాయలను వేలం వేస్తారు.ఈ పండుగలో దాదాపు 9 నిమ్మకాయలు సమర్పిస్తారు.కొన్నేళ్ల క్రితం వేలంలో ఉంచిన నిమ్మకాయల ద్వారా పాలకవర్గం రూ.68,000 అందుకుంది.ఒక జంట లెమోను రూ.27000 చెల్లించి ఈ నిమ్మ‌కాయ‌ను కొనుగోలు చేసింది.ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయంలో ఆచారం కొనసాగుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు