సినీ ప్రపంచమంతా ఒక్కటే కాని అది మాత్రమే భిన్నం.. అలియా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అలియా భట్ ( Alia Bhatt ) కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా టాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈమె దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( S S Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అలియా భట్ ఏకంగా హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈమె హార్ట్ ఆఫ్ స్టోన్ ( Heart Of Stone ) అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు.

The World Of Cinema Is One But That Is The Only Difference, Alia Bhatt, Kia Dhav

ఈ సినిమా అలియా భట్ కు మొదటి హాలీవుడ్ సినిమా కావడం విశేషం.ఇందులో ఈమె కియా ధావన్ ( Kia Dhavan ) అనే పాత్రలో నటించారు.త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియా భట్ బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.సందర్భంగా అలియా భట్ ను ప్రశ్నిస్తూ మీరు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలలో నటించారు.

Advertisement
The World Of Cinema Is One But That Is The Only Difference, Alia Bhatt, Kia Dhav

ఇప్పుడు హాలీవుడ్ చిత్రమైనటువంటి హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో నటించారు.ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటూ ప్రశ్నించారు.

The World Of Cinema Is One But That Is The Only Difference, Alia Bhatt, Kia Dhav

ఈ ప్రశ్నకు అలియా భట్ సమాధానం చెబుతూ.నిజానికి బాలీవుడ్( Bolly wood ) హాలీవుడ్ (Holly wood) సినిమా ఇండస్ట్రీలకి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదని తెలిపారు.నాకు తెలిసి సినీ ప్రపంచమంతా ఒకటేనని ఈమె తెలిపారు.

అదే వ్యక్తులు, నిత్యం సినిమాల గురించి ఆలోచనలు చేసే విధానం, సినిమాలను చూసే దృష్టి అంతా కూడా ఒకటే కానీ భాష మాత్రమే విభిన్నం అంటూ ఈ సందర్భంగా ఆలియా భట్ సమాధానం చెప్పారు.కానీ మనం ఏ సినిమాలలో నటించిన బాబోద్వేగాల కోసం పనిచేయాలి.

ఎందుకంటే చివరికి అదే ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు