కుక్క మిస్సింగ్ పోస్టర్ తీసేసాడని సొసైటీ ప్రెసిడెంట్‌నే కొట్టిన మహిళ.. వీడియో వైరల్!

సాధారణంగా పెంపుడు కుక్కలపై( pet dog ) యజమానులకు ఎంతో ప్రేమ ఉంటుంది.అవి తప్పిపోతే యజమానులు పడే బాధ వర్ణనాతీతం.

వాటికి ఏమైందో, ఎక్కడున్నాయో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాయో తెలియక ఓనర్స్ అల్లాడిపోతారు.త్వరగా వాటిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

తాజాగా నోయిడాలోని ఒక మహిళ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండగా సొసైటీ ప్రెసిడెంట్ ఆమెకు నచ్చని ఒక పని చేశాడు.అదేంటంటే అతడు ఆమె అతికించిన డాగ్ మిస్సింగ్ పోస్టర్‌ను తీసేశాడు.

ఇది తెలుసుకున్న ఆ మహిళ తీవ్ర కోపానికి గురైంది.

Advertisement

అనంతరం సొసైటీ ప్రెసిడెంట్‌ని అపార్ట్మెంట్ ముందు గల్లా పట్టుకుని మరీ ఆ మహిళ ( Noida Woman )అతడిని తిట్టిపోసింది.అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టు కంటే పెద్దదా? పోస్టర్ ఎందుకు తీసేస్తావు, నీకెందుకు భయపడాలి అంటూ సదరు వ్యక్తిని నిలదీసింది.టీ-షర్ట్ కాలర్‌ను లాగుతూ, అరుస్తూ ప్రెసిడెంట్‌కి చుక్కలు చూపించింది.

నోయిడాలోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా సదరు వ్యక్తి ఉన్నాడు.ఆ వ్యక్తిని మహిళ తోసుకుంటూ చెడుగా ప్రవర్తించింది.

చెంప చెల్లుమనిపించాలని కూడా ట్రై చేసింది.ఆ సమయంలో భయంతో వణికిపోయిన సదరు ప్రెసిడెంట్ ఆమెను మర్యాదగా ప్రవర్తించాలంటూ అడిగాడు.

అయినా కూడా ఆమె అతడిని జుట్టు పట్టుకొని కొట్టేందుకు ప్రయత్నించింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.మరోవైపు నోయిడా( Noida ) సెక్టార్-113 పోలీస్ స్టేషన్‌లో పోలీసు కేసు నమోదైంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై స్పందించింది.సమస్యను పరిస్కరించినట్లు వెల్లడించింది.

Advertisement

అయితే ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేశారు.మహిళ అలా చేయి చేసుకోవడం తప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు.

ఇలా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని మరికొందరు ప్రశ్నించారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు