ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఘటనలు జరుగుతుంటాయి.ఇవి అరుదుగా ప్రజల కంటపడతాయి.
అయితే ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల వాటిని ఫోన్లలో బంధించి అందరికీ షేర్ చేస్తున్నారు.
అలా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social media )వైరల్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ప్రముఖ వైరల్ వీడియో( Viral video ) షేరింగ్ పేజీ సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసిన ఈ వీడియోకు రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.43 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు.
వివరాలకు వెళ్తే, ఇటీవల స్కాట్లాండ్ దేశం, స్టిర్లింగ్‌షైర్ కౌంటీలోని ముగ్‌డాక్ ఫారెస్ట్‌ను స్టార్మ్ బాబెట్( Storm Babette ) అనే తుఫాను తాకింది.ఆ సమయంలో గాలి చాలా బలంగా వీచింది.దాంతో భూమి కంపించింది.
డేవిడ్ నుజెంట్-మలోన్ అనే ఒక డాగ్ వాకర్ అటువైపుగా వెళ్తూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు.ఆ సమయంలో అడవి నేల పెద్ద డర్ట్ కెరటంలా మొత్తం పైకి, కిందకు కదిలింది.
చెట్లకు చాలా చిన్న వేర్లు ఉన్నందున చెట్లతో సహా ఆ భూమి పొర అనేది పైకి లేసి కింద పడింది.అతనితో పాటు వచ్చిన కుక్క పైకి లేచి కింద పడుతున్న నెల మీదకి కూడా ఎక్కింది.
అది అలా ఆ భూప్రదేశాన్ని ఎక్కిన కొన్ని సెకన్లలో భూమి మళ్లీ పైకి లేచింది.దాంతో కుక్క చాలా భయపడిపోయింది.
గాలి భూమిని సులభంగా నెట్టేసింది, భూమిని పైకి లేపగలిగింది.ఈ టైమ్ లో అడవి( Forest ) సజీవంగా ఉండి ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించింది.ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇది ఒక మురికి గుడ్డను పైకి ఎత్తినట్లు ఉందన్నారు.ప్రకృతి ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ వీడియో( video ) చూస్తే అర్థమవుతుందని అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy