నేటితో ముగియనున్న జనసేనాని వారాహియాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న మూడో విడత వారాహి యాత్ర ఇవాళ్టితో ముగియనుంది.

ఈనెల 10న ఈ యాత్ర ప్రారంభం కాగా ఇందులో భాగంగా విశాఖలోని పలు ప్రాంతాల్లో జనసేనాని పర్యటన కొనసాగింది.

వాలంటీర్ చేతిలో హత్యకు గురైన కుటుంబాన్ని మొదటగా పరామర్శించిన పవన్ కల్యాణ్ రుషికొండ, గాజువాక, విసన్నపేట ప్రాంతాల్లో పర్యటించారు.ఈ మేరకు భారీ బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ప్రజా సమస్యలను వినతులను స్వీకరించేందుకు గానూ జనసేన జనవాణి కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దీంతో విశాఖలో మూడో విడత వారాహి యాత్ర విజయవంతం అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు