ద్రోహి వచ్చేశాడు చూడండి.. ధోని అంతమాట అనేశాడేంటి? వైరల్ వీడియో

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన సీఎస్‌కేకు తాజాగా మరో తీవ్ర ఆటంకం ఎదురైంది.

జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) గాయం కారణంగా మిగిలిన టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.దీంతో సీఎస్‌కే నాయకత్వ బాధ్యతలు మళ్లీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని( MS Dhoni ) భుజాలపై పడింది.

ఎలాగైనా ధోని తన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తాడన్న నమ్మకంతో మరోమారు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.ఇక నేడు జరగనున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో చెన్నై జట్టు చెపాక్ మైదానంలో నెట్స్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది.ధోనీసైతం ప్రాక్టీస్ లో బిజీగా మారాడు.

Advertisement

అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌లోనే ఓ అపురూపమైన ఘట్టం చోటుచేసుకుంది.సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత కేకేఆర్ మెంటార్‌గా ఉన్న డ్వేన్ బ్రావో( Dwayne Bravo ) మైదానంలోకి వచ్చి సీఎస్‌కే ఆటగాళ్లను పలకరించాడు.ఈ క్రమంలో రవీంద్ర జడేజా బ్రావోను గట్టిగా హాగ్ చేసుకోగా, ధోని మాత్రం తనదైన హాస్య శైలిలో స్పందించాడు.

‘‘ఇదిగో.ద్రోహి వచ్చేశాడు చూడండి!’’ – అంటూ ధోని పేర్కొనగా, ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

చాలా చిత్రమైనది’’ అని బ్రావో నవ్వుతూ స్పందించాడు.

ఈ అపురూప క్షణాలను సీఎస్‌కే తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ "ఎంఎస్ - డీజే.ఆ వైబ్‌ను మిస్సవుతున్నాం" అనే క్యాప్షన్‌ను జత చేసింది.ఈ వీడియో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతూ, బ్రావో జట్టును విడిచిపోతాడని ఊహించలేకపోయామంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే , డ్వేన్ బ్రావో 2011 నుండి 2015 వరకు, తరువాత మళ్లీ 2018 నుండి 2022 వరకు చెన్నై జట్టులో ఆడాడు.2011, 2018, 2021, 2022 ఐపీఎల్ టైటిళ్లలో అతడు కీలక ఆటగాడిగా నిలిచాడు.గౌతం గంభీర్ స్థానాన్ని భర్తీ చేస్తూ, డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్‌కు కీలక మార్గదర్శిగా మారాడు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు