పేరుకే మూడు పార్టీల కూటమి.. పెత్తనమంతా ఆ పార్టీదే

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీని ( YCP )ఓడించడమే లక్ష్యంగా ఏర్పడింది.టిడిపి ,జనసేన, బిజెపి కూటమి.

ఈ పార్టీలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తి చేసి, విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.అయితే కొన్ని చోట్ల సీట్ల కేటాయింపు విషయంలో మూడు పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు.

  దీంతో ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల సర్దుబాట్లు చేసుకున్నారు.మూడు పార్టీల అగ్ర నేతల అంగీకారంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం జరిగినా,  క్షేత్రస్థాయిలో మాత్రం ఆయా పార్టీల కార్యకర్తల్లో  అసంతృప్తి తీవ్రంగా ఉంది.

ముఖ్యంగా ఈ పొత్తుల కారణంగా సీట్ల విషయంలో టిడిపి వ్యవహరిస్తున్న తీరుపై జనసేన , బీజేపీ( Janasena , BJP ) నాయకుల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది.ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీకి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిన జనసేన , బిజెపిలకు సరైన న్యాయం చేయాల్సింది పోయి , తమ పార్టీకి చెందిన నేతలతో పార్టీ మార్పించి జనసేన, బిజెపి లలోకి పంపించి అక్కడ వారికి టిక్కెట్టు వచ్చే విధంగా రాజకీయం చేస్తూ ఉండడంపై రెండు పార్టీల కార్యకర్తలలోను అసంతృప్తి ఉంది .ఇప్పటికే ఈ విషయం పై అధికార పార్టీ వైసీపీ సెటైర్లు వేస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేలు చేసే పొత్తు కోసం తమ పార్టీలను ఎందుకు బలహీనం చేసుకోవాలంటూ రెండు పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు .దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలను నమ్మి , జెండాలు మోసిన వారిని పక్కనపెట్టి టీడీపీ నుంచి చివరి నిమిషంలో వచ్చి చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వడం పై తీవ్ర అసంతృప్తి నెలకొంది.పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు దక్కాయి.

Advertisement
The Three-party Alliance Is The Name Of That Party, BJP, TDP, Janasena, Pavan Ka

  పాలకొండ మినహా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించారు.దీంట్లో 5 సీట్లను టిడిపి నుంచి వచ్చిన వారే దక్కించుకున్నారు.

భీమవరం టిడిపి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉంగుటూరు నుంచి పి ధర్మరాజు( P Dharmaraju ) ,రైల్వేకోడూరు నుంచి అరవ శ్రీధర్,  అవనిగడ్డ( Arava Sridhar, Avanigadda ) నుంచి మండలి బుద్ధ ప్రసాద్ కు జనసేన టికెట్లు దొరికాయి.

The Three-party Alliance Is The Name Of That Party, Bjp, Tdp, Janasena, Pavan Ka

పాలకొండ టికెట్ ను నిమ్మాక జయ కృష్ణకు( Nimmaka JayaKrishna ) కేటాయించనున్నారు.టికెట్ కేటాయించే ముందు రోజునే టిడిపికి రాజీనామా చేసి జనసేనలో చేరిన వారే.అలాగే వైసిపి నుంచీ టికెట్ హామీతో జనసేనలో చేరిన వారూ చాలామంది ఉన్నారు .ఈ విధంగా పంచకర్ల రమేష్ బాబు , పెందుర్తి వంశీకృష్ణ,   , కొణతాల రామకృష్ణ అనకాపల్లి , బత్తుల బలరామకృష్ణ రాజానగరం ఆరాణి శ్రీనివాస్ ( Arani Srinivas ) తిరుపతి , బాలశౌరి మచిలీపట్నం ఎంపీ టికెట్ ను దక్కించుకున్నారు.ఇక బిజెపి ప్రకటించిన అభ్యర్థుల జాబితా లోను టిడిపి నేతలు ఎక్కువమంది ఉన్నారు.

అరకు ఎంపీ సీటు దక్కించుకున్న కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి గెలిచి టిడిపి మద్దతుదారుగా వ్యవహరించారు.  ఇప్పటికీ టిడిపి కి సన్నిహితంగానే మెలుగుతున్నారు.  అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్,  చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

బిజెపిలో చేరినా చంద్రబాబు( Chandrababu ) కనుసనల్లోనే పని చస్తారనే విషయం అందరికీ తెలిసిందే.ఇక బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొజ్జ రోషన్న ఐదేళ్లుగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నవారే .ఆయనతో చివరి నిమిషంలో పార్టీకి రాజీనామా చేయించి ,బిజెపిలో చేర్పించి టిక్కెట్ ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది.  ఇక కైకలూరు నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల సమయంలో టిడిపి నుంచి వచ్చి,  బిజెపిలో చేరి గెలిచి మంత్రి అయ్యారు.ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు.2019 ఎన్నికల్లోను పోటీకి దూరంగానే ఉన్నారు.ఇప్పుడు ఆయనే మళ్లీ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విజయవాడ పశ్చిమ నుంచి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సృజనా చౌదరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇక జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి 2019 వరకు టిడిపిలో మంత్రిగా ఉన్నవారే.

Advertisement

ఇదేవిధంగా టిడిపి నుంచి జనసేన బిజెపిలో చేరిన వారికే పార్టీ టికెట్లు దక్కడం తో మొత్తం తెలుగుదేశం పార్టీ దే పెత్తనం అంతా అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

తాజా వార్తలు