మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ ముగ్గురు ఎంపీలకు నచ్చలేదా..?

దేశంలోనే చరిత్రత్మకమైనటువంటి బిల్లు బిజెపి( BJP ) హయాంలో ఆమోదం పొందింది.

గత 28 సంవత్సరాల నుంచి ఈ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళామణులు ఎదురుచూస్తున్నారు.

అలాంటి చరిత్రత్మక ఘట్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ( Womens Reservation Bill ) కు సంబంధించి ఓటింగ్ ను తెలంగాణ ముగ్గురు ఎంపీలు బహిష్కరించారని తెలుస్తోంది.మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ముగ్గురు మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయం దాకా అక్కడే ఉండి సరిగ్గా ఓటింగ్ జరిగే సమయంలోనే సభ నుంచి వెళ్లిపోయారట.

అంటే బిల్లును వారు కావాలనే బహిష్కరించినట్టు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దీన్ని బట్టి చూస్తే 33 శాతం మహిళా రిజర్వేషన్ రావడం వాళ్లకి ఇష్టం లేదని అర్థమవుతుంది.19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఓటింగ్ నిర్వహించారు.అదేరోజు సాయంత్రం 5.30 గంటల నుంచి ఏఐసీసీ కార్యాలయంలో మాణిక ఠాగూర్ ( Manickam tagoure ) రూమ్ లో వెయిట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బెల్లయ్య నాయక్,మాజీ మంత్రి వినోద్ ఉన్నారట.

Advertisement

సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్ వార్ రూమ్ కి వెళ్ళిన రేవంత్ రెడ్డి(Revanth reddy) .అంటే ఓటింగ్ సమయంలో వారు సభలో లేరని అర్థమవుతుంది.కేవలం రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తంకుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటింగ్ లో పాల్గొనలేదని సోషల్ మీడియాలో వార్తలు అనేకం వినిపిస్తున్నాయి.

దీంతో బిఆర్ఎస్ నేతలు స్పందించి మహిళా సాధికారత కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని, అందుకే వారు ఓటింగ్ లో పాల్గొనలేదని, రాబోవు ఎన్నికల్లో ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని పలు రకాలుగా ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు