Sri Umakukkuteswara Swami : గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉన్న గుడి.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఎక్కడంటే..

మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు.ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే చాలామంది ప్రజలు ఉంటారు.

ఇంకా చెప్పాలంటే గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసి వేయబడతాయి.హిందూసనాతన ధర్మంలో గ్రహణకాలానికి ప్రాముఖ్యత అంత ఉంది.

సూర్య గ్రహణం, చంద్ర గహణం ఇలా ఏ గ్రహణం ఏర్పడినా సరే ఆలయాలన్నీ మూసివేస్తారు.గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన తరువాత మళ్లీ భక్తులు ఆలయ దర్శనానికి వస్తారు.

ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తుందో తెలియదు కానీ, గ్రహణ సమయంలో కూడా కొన్ని ఆలయాలు దేశవ్యాప్తంగా తెరిచి ఉన్నాయి.ఎప్పుడు జరుగుతున్నట్లే పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

Advertisement
The Temple Is Open Even During The Eclipse , Temple, Eclipse, Pooja , Devotional

అటువంటి దేవాలయాల్లో ప్రముఖంగా ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాళహస్తి దేవాలయం ఒకటి.

The Temple Is Open Even During The Eclipse , Temple, Eclipse, Pooja , Devotional

అయితే గ్రహణాలు పట్టని గుడి ఇంకొకటి కూడా ఉంది.ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ శక్తి పీఠంగా పేరు ప్రఖ్యాతలుగాంచింది.పిఠాపురం పట్టణంలో గ్రహణాలు లతో సంబంధం లేని ఒక ఆలయం ఉంది.

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా సరే ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది.ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి యధావిధిగా పూజలను అందుకుంటు ఉంటారు.

ఇది చాలా కాలం క్రితం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో శ్రీకాళహస్తి, పిఠాపురం పాదగయ క్షేత్రం దేవాలయాలు గ్రహణ సమయంలో ఎప్పుడు తెరిచే ఉంటాయి.నవంబర్ 8వ తేదీన ఏర్పడిన చంద్రగ్రహణకాలం లోను భక్తులు దర్శనాలు, పూజలు చేశారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ప్రధాన ఆలయాలైనా అష్టాదశ శక్తి పీఠం పురుహూతికా అమ్మవారు,రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారులను దర్శించుకోవడానికి చంద్ర గ్రహణ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.చంద్ర గ్రహణం కాలంలో పరిశుభ్రంగా పట్టు విడుపు స్నానాలు చేసి అభిషేకాలు, అర్చనలు వంటి కార్యక్రమాలను అర్చకులు చేస్తూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు