బీజేపీ అంటే ఈ రెండు పార్టీలకు భయమా భక్తా ?

అధికార పార్టీ బిజెపి విషయం ఒక స్పష్టమైన క్లారిటీతో ఉండలేకపోతున్నాయి ఏపీ అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న,  ధరల పెరుగుదల వంటి విషయాల్లోనూ కేంద్రం విఫలమైందనే వాదనలు ఉండటం తదితర కారణాలతో బీజేపీ వ్యతిరేక పార్టీలు తీవ్రంగానే విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నాయి.

అయినా ఏపీ లోని ఈ రెండు ప్రధాన పార్టీలు బిజెపి విషయంలో మౌనంగానే ఉండిపోతున్నాయి.ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపిని విమర్శిస్తున్నా, బిజెపి రాష్ట్ర నాయకత్వం వరకే టిడిపి , వైసిపిలు విమర్శలు చేస్తున్నాయి తప్ప కేంద్రాన్ని విమర్శించే సాహసం చేయలేకపోతున్నాయి.

పైగా కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు తమ వంతు మద్దతు తెలుపుతూ ఓటింగ్ లో  అండగా నిలుస్తున్నారు.ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్న పట్టించుకోనట్టు గానే వైసిపి టిడిపి వ్యవహరిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం కోల్పోవడంతో, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలు అందుతుండటంతోనే బీజేపీ ని విమర్శించే సాహసం ఈ రెండు ప్రధాన పార్టీలు చేయలేకపోతున్నాయి.

Is Tdp And Ycp Still Acting As They Are Afraid Of Bjp Details, Bjp, Congress, T
Advertisement
Is Tdp And Ycp Still Acting As They Are Afraid Of Bjp Details, BJP, Congress, T

తాజాగా దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని విద్వేషాలు పెంచుతోందని దేశాన్ని విభజిస్తోందని ఆరోపిస్తూ 13 ప్రాంతీయ పార్టీలు ఒక్కటే సంయుక్తంగా ఓ పిలుపును ఇచ్చాయి.ప్రజలంతా బీజేపీ విధానాలను తిప్పికొట్టాలనే ప్రకటనపై అనేక ప్రాంతీయ పార్టీలు సంతకం చేసేందుకు నిరాకరించాయి.అయితే బీజేపీ గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా దీనికి దూరంగానే ఉన్నారు.

ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సైతం ఇదేవిధంగా వ్యవహరించడంతో  కేంద్ర అధికార పార్టీ బీజేపీ అంటే ఈ ప్రాంతీయ పార్టీలకు భయమా లేక భక్త అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు