సుబ్రహ్మణ్య షష్టి ఇలా చేస్తే...కష్టాలు తొలగి కోరిన కోరికలు తీరతాయి

సుబ్రహ్మణ్య స్వామికి ఏమి ఇచ్చి పూజ చేస్తే మన కష్టాలు తీరతాయో మీకు తెలుసా? మనకు వచ్చిన కష్టాలను,దుఃఖాలను ,బాధలను నుండి విముక్తి సుబ్రహ్మణ్య స్వామి కలిగిస్తారు.

సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి షష్టి.

సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే జన్మదినం అయినా షష్టి ఈ శుక్రవారమే.ఆ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఎటువంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది.

The Significance Of Subramanya Shasti-The Significance Of Subramanya Shasti-Devo

అందువల్ల సుబ్రహ్మణ్య షష్టి రోజున ఎటువంటి అశ్రద్ధ లేకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి.ఆ ఆరాధన ఎలా చేయాలో తెలుసుకుందాం.

సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకొని ఎర్రటి పువ్వులతో ఓం షం షరావణభావయా నమః అంటూ మంత్రాలను చదువుతూ పూజ చేయాలి.అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేసి మూడు ఒత్తులు వేసి నువ్వులనూనెతో దీపారాధన చేసి పానకం,వడపప్పు,చిమిలి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంటిలోని వారందరు తింటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది.

Advertisement

ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి చెట్టు దగ్గర ఉండే జంట నాగులను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పాలు, చిమిలి నైవేద్యం పెట్టి పూజిస్తే ఏమైనా జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయి.ఈ విధంగా షష్టి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఇంటిలోని వారందరూ ఎటువంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు