Siddham : సోష‌ల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘సిద్ధం’ సభ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ( YCP ) మరోసారి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

ఈ క్రమంలోనే ‘సిద్ధం’ పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.ఏపీ రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా సిద్ధం సభలు నిలుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అంతేకాదు వైసీసీ చేపట్టిన సిద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.వైసీసీ ‘సిద్ధం’ జన సముద్రాన్ని తలపిస్తోందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఉత్తరాంధ్రలోని భీమిలి సిద్ధం సభ నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే రెండు సభలను విజయవంతంగా నిర్వహించిన వైసీపీ తాజాగా అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

Advertisement

రాప్తాడు సభ అశేష జనవాహినితో సముద్రాన్ని తలపించగా.సీఎం వైఎస్ జగన్ ప్రసంగం సింహనాదాన్ని తలిపించింది.

ఈ సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్ డేట్స్ తో సామాజిక మాధ్యమాలు షేక్ అవుతున్నాయి.దీంతో ప్రస్తుతం రాప్తాడు సభ( Raptadu sabha ) సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం -3 సభకు రాయలసీమ జిల్లాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా ఆయా జిల్లాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆ ప్రాంతాన్ని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.దీంతో ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లు సిద్ధం సభకు సంబంధించిన ఫొటోలతో నిండిపోయింది.

మరోవైపు ట్విట్టర్ లో సిద్ధం హ్యాష్ ట్యాగ్ యావత్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

అంతేకాదు రాప్తాడు సిద్ధం సభకు సీఎం వైఎస్ జగన్ హాజరు కాకముందే దీనికి సంబంధించిన అప్ డేట్స్ సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపాయని చెప్పుకోవచ్చు.జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ షేక్ చేయగలమని ఓ అభిమాని కామెంట్ చేశారు.అదేవిధంగా ఆన్ లైన్ ఆర్ ఆఫ్ లైన్ జగనన్న ఇన్ రోలింగ్ లైన్ అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి.

Advertisement

సిద్ధం సభలతో వైసీపీ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు