కెమేరాను మింగేసిన షార్క్.. లోపలి నుండి దృశ్యాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సముద్రలో డైవింగ్ (Diving in the sea)చేయడం కొంతమందికి రిస్క్, మరికొందరికైతే సాహసయాత్ర.

సముద్ర గర్భంలోని ప్రపంచాన్ని అన్వేషించేందుకు డైవర్లు కెమెరాలతో అద్భుతమైన దృశ్యాలను రికార్డ్ చేస్తుంటారు.

ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా, ఒక షార్క్(Shark) కెమెరాను మింగేసిన ఘటన సంచలనంగా మారింది.

సముద్రంలో డైవింగ్ చేస్తున్న ఓ బృందం దగ్గరకు ఓ భారీ షార్క్ ఆకస్మాత్తుగా వచ్చింది.అది ఓ ఇనుప ముక్కను మింగేందుకు ప్రయత్నించగా, డైవర్లు అప్రమత్తమై(Divers are alerted.

), తమ వద్ద ఉన్న ఓ కెమెరాను షార్క్ నోట్లోకి విసిరారు.ఆ సమయంలో ఆ కెమెరా ఆన్‌లో ఉండటంతో, షార్క్ కడుపు లోపలి దృశ్యాలను రికార్డ్ చేసింది.

The Shark That Swallowed The Camera... The Scenes From Inside Are Amazing,shark
Advertisement
The Shark That Swallowed The Camera... The Scenes From Inside Are Amazing!,Shark

ఈ ఘటనతో, షార్క్ శరీరం లోపలి(Inside the sharks body) భాగానికి సంబంధించిన అద్భుత దృశ్యాలు ప్రపంచానికి తెలిసేలా అయ్యాయి.కొద్ది క్షణాల తర్వాత, షార్క్ ఆ కెమెరాను మళ్లీ ఉమ్మేసింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది విపరీతంగా వైరల్ అయింది.ఇప్పటివరకు 2.6 లక్షల మందికి పైగా ఈ దృశ్యాన్ని వీక్షించగా.2.2 వేల మందికి పైగా లైక్ చేశారు.

The Shark That Swallowed The Camera... The Scenes From Inside Are Amazing,shark

నెటిజన్లు ఈ అరుదైన ఘటనపై తాము ఎంతగానో ఆశ్చర్యపోతున్నట్లు కామెంట్లు చేశారు.ఇది అత్యంత అరుదైన ఫుటేజ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది చూస్తే అర్థమవుతోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరు షార్క్ శరీరం లోపలి వీడియో చూడటం నిజంగా ఆశ్చర్యకరం అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!
Advertisement

తాజా వార్తలు