చైనా: అతిపెద్ద వాటర్ ఫాల్ వెనుక ఎవరికీ తెలియని సీక్రెట్..??

చైనాలోని యుంటై జలపాతం( Yuntai Falls in China ) అత్యంత ఎత్తయిన తీయలేదా పొడవైనది అని చెప్పవచ్చు.

ఇది చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఈ పర్యాటకులు ఈ ప్రాంతానికి పోటెత్తుతుంటారు.

అయితే ఇటీవల, ఈ జలపాతం ఒక వివాదంలో చిక్కుకుంది.ఒక పర్యాటకుడు డ్రోన్ ద్వారా తీసిన వీడియోలో, జలపాతం పైభాగంలో ఒక హిడెన్( Hidden ) పైపు కనిపించింది.

దీని ద్వారా జలపాతం ప్రవాహం కృత్రిమంగా పెంచడం జరుగుతోందని స్పష్టమైంది.ఈ వీడియో డౌయిన్ (చైనా టిక్‌టాక్) లో షేర్ చేశారు.

తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.

Advertisement

పర్యాటకుల వీడియో వైరల్ అయ్యాక పార్క్ అధికారులు ఆందోళన చెందారు.జలపాతం ప్రవాహాన్ని పెంచడానికి అన్‌సీజన్‌లో పైపులను ఉపయోగిస్తామని ఒప్పుకున్నారు.సహజ జల మట్టాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ జలపాతం కొత్త కొండ లాగానే కనిపిస్తుంది దీనివల్ల టూరిస్టులు నిరాశ పడిపోవచ్చు కాబట్టి వారి కోసం ఈ పైపు ద్వారా నీటిని పంపిస్తుంటారు.

ఈ పార్క్ లక్ష్యం ఏమిటంటే, వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా, జలపాతాన్ని ఏడాది పొడవునా దాని ఉత్తమ స్థితిలో ప్రదర్శించడం.

314 మీటర్ల ఎత్తున్న ఈ జలపాతం యుంటై జియో పార్క్‌లో ( Yuntai Geo Park )ఉంది, అయితే కొంతమంది విమర్శకులు జలపాతం ప్రవాహాన్ని కృత్రిమంగా నిర్వహించడం మోసపూరితమైన చర్య అని కామెంట్లు చేశారు.సహజ ప్రకృతిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఈ చర్య దానికి విరుద్ధం అని మండిపడ్డారు.మరోవైపు, పర్యాటకులకు ఎల్లప్పుడూ మంచి అనుభవాన్ని అందించడానికి ఈ పని చేస్తున్నారని, దీనివల్ల ఎవరికీ హాని జరగదని మరి కొంతమంది పేర్కొన్నారు.

జలపాతం సహజ ప్రవాహం వర్షాకాలంలో పునఃప్రారంభమవుతుందని పార్క్ యాజమాన్యం స్పష్టం చేసింది.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు