భరత్ అంతక్రియలకి రవితేజ రాకపోవడానికి అసలు కారణం ఇదే

రవితేజ తమ్ముడు, సినీనటుడు భరత్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.ఈ విషాద సంఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీ వారిని కలచివేసింది.

నిన్న జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో జరిగిన భరత్ అంతక్రియలకు చాలామంది సినిమా వారు హాజరయ్యి కడసారి విడ్కోలు పలికారు.కాని భరత్ సొంత అన్నయ్య రవితేజ, భరత్ తండ్రి, ఇద్దరు అంతిమయాత్రలో పాల్గొనలేదు.

ఇలా ఎందుకు? సొంత మనుషులు చివరి చూపు చూడ్డానికి రాకపోవడం ఏంటి ? మీడియాలో రవితేజ రాకపోవడంపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.భరత్ ని రవితేజ ఎప్పుడో వదిలేసాడని, తమ్ముడిలా ఫీల్ అవడం మానేసి చాలాకాలమైందని రూమర్లు పుట్టుకొచ్చాయి.

కాని ఇదంతా నిజం కాదు.యాక్సిడెంటులో సొంత తమ్ముడి శరీరం గుర్తుపట్టలేనంత దారుణంగా మారింది.

Advertisement

ఆ దృశ్యాన్ని చూసి తట్టుకునే శక్తి తనకు లేదనే రవితేజ రాలేదట.భరత్ తండ్రి కూడా రాకపోవడానికి ఇదే కారణం అంట.రవితేజ భరత్ కి దూరంగా ఉంటున్న మాట వాస్తవమే కాని, భరత్ ని పూర్తిగా దూరంగా పెట్టలేదు.జీవనాధారం లేని భరత్ ని, భరత్ ఫ్యామిలిని పోషిస్తున్నది రవితేజనే.

భరత్ ఇంతకుముందు ఎన్నో వివాదాల్లో ఇరుకున్నాడు.మద్యానికి బానిసై, చేయరాని పనులు చేసి రవితేజకి చెడ్డపేరు తెచ్చినప్పటికి తమ్ముడికి ఆర్థికంగా సహాయపడ్డాడు రవితేజ.

పోలీస్ చేతులకి చిక్కినప్పుడల్లా రవితేజనే బేయిల్ మీద విడిపించాడు.ఇదంతా తమ్ముడి మీద ప్రేమతోనే కదా చేసింది.

చేయి దాటిన తమ్ముడు అలా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటోంటే చూడలేక భరత్ కి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు రవితేజ.అయినా, ఆర్థికంగా మాత్రం తోడుగా ఉన్నాడు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఇప్పుడు తమ్ముడిని ప్రాణాలు లేకుండా చూసే శక్తి లేక అంతక్రియలకి హాజరు కాలేదు.

Advertisement