ది రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ అప్పుడేనట.. ప్రబాస్ ఫ్యాన్స్ కు తీపికబురు ఇదే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్,( Prabhas ) డైరెక్టర్ మారుతి( Director Maruthi ) కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్.

( The Rajasaab ) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో నిధి అగర్వాల్,మాళవిక మోహనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

అయితే ఈ సినిమా వచ్చే నెల అనగా మేలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ విడుదల తేదీ పై ఇంకా సరైన స్పష్టత రాలేదు.

ఇకపోతే ఈ సినిమా టీజర్ మే నెలలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా హిట్ ఇచ్చినట్టుగా ఉన్నాయి.తాజాగా డైరెక్టర్ మారుతి ఒక ఆటో వెనుక ఉన్న రాజా సాబ్ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకుంటూ హై అలర్ట్ మేలో నుంచి వేడిగాలులు మరింత పెరగనున్నాయి అంటూ ఒక క్యాప్షన్ ని కూడా జోడించారు.దీంతో మే నెల మధ్యలో ఈ చిత్ర టీజర్‌ విడుదల కానుందని పరోక్షంగా స్పష్టత వచ్చినట్లయింది.

ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు పూర్తయ్యాయని విదేశాల నుంచి ప్రభాస్‌ తిరిగి రాగానే తనతో డబ్బింగ్‌ పూర్తి చేసి టీజర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

రొమాంటిక్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ కు సంబంధించిన లుక్స్ ని రివీల్ చేసిన విషయం తెలిసిందే.ఈ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.పంచ కట్టుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు డార్లింగ్ ప్రభాస్.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు