ఆ పక్షిని టీజ్‌ చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్ వీడియో వైరల్!

స్నేహితులు జీవితాన్ని రంగులమయం చేస్తారనడంలో సందేహం లేదు.బాధలో ఉన్నా,కష్టాల్లో ఉన్నా స్నేహితులు మనల్ని అక్కున చేర్చుకొని ఓదార్చుతారు.

మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా ఈజీగా, హ్యాపీగా గడిచిపోతుంది.అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.

స్నేహానికి సరిహద్దులు లేవు అన్నట్లుగా జంతువులు ఇతర జంతువులతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాయి.ఈ విషయాన్ని ఒక వీడియో మరోసారి రుజువు చేస్తోంది.

ఈ వీడియోని చూసి నెటిజన్లందరూ ఫిదా అవుతున్నారు.ఈ వీడియోను వైరల్‌హాగ్ ట్విట్టర్, యూట్యూబ్‌లో షేర్ చేసింది.

Advertisement

"ఈము పక్షి ప్యారిస్ ది యార్క్‌షైర్ టెర్రియర్‌ కుక్కతో హాయిగా ఆడుకుంటుంది" అని వైరల్‌హాగ్ ఒక క్యాప్షన్ జోడించింది.వైరల్ అవుతున్న వీడియోలో ఈము పక్షితో ఒక కుక్క పిల్ల ఆడుకోవడం చూడవచ్చు.

ఈ అందమైన జంతువులు ఒకదానికొకటి స్నేహంగా మెలుగుతూ భలే ఎంజాయ్ చేశాయి.పక్షి కుక్కని ముక్కుతో పొడుస్తూ భయం లేకుండా టీజ్ చేసింది.

ఈ రెండూ కూడా లోకాన్ని మరచి ఎగురుతూ, గెంతుతూ, ఒకదానికొకటి పోట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఆడుకున్నాయి.అయితే కుక్క చిన్నపిల్ల కావడంతో ఈము పక్షి భయపడలేదు.

అలానే ఇవి కూడా ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఆటలు ఆడాలి.ఈ వీడియో చూసిన నెటిజన్లు వీటి స్నేహం చాలా క్యూట్ గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

ఈ రెండు ఫ్రెండ్స్ అయ్యాయి కాబట్టి వాటికి ఇక సమయమే తెలియదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్యూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement