మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై భ‌గ్గుమంటున్న ప‌బ్లిక్‌.. ఆ విష‌యంపై అధిష్టానం కూడా!

ఏమైందో ఏమోగానీ ఈ మ‌ధ్య వ‌రుసగా తెలంగాణ మంత్రులు తీవ్ర వివాదంలో చిక్కుకుంటున్నారు.

మొన్న‌టికి మొన్న మంత్రి నిరంజ‌న్‌రెడ్డి, ఆ త‌ర్వాత మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ఆ త‌ర్వాత గంగుల క‌మ‌లాక‌ర్ లాంటి వాళ్లు నోరు జార‌డంతో ప‌బ్లిక్ దుమ్మెత్తి పోశారు.

అయితే ఈ సారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వంతు వ‌చ్చిన‌ట్టు ఉంది.ఆయ‌న ఏకంగా ఓ కుటంబాన్ని టార్గెట్ చేయ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆ కుటుంబ‌పై అక్ర‌మంగా కేసులు పెడుతున్నారంటూ వారు ఏకంగా మీడియా ముందుకు రావ‌డం అది కూడా టీఆర్ ఎస్ టార్గెట్‌గా ఉంటున్న జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు, అలాగే తీన్మాన్ మ‌ల్ల‌న్న ఛాన‌ళ్ల వ‌ద్ద‌కు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకోవ‌డంతో చూసిన వారంతా భ‌గ్గుమంటున్నారు.బాధిత భార్యాభ‌ర్తలు ఏకంగా నిన్న రాత్రి తీన్మాన్ మ‌ల్ల‌నుకు చెందిన న్యూస్ ఛాన‌ల్‌కు వెళ్ల‌డం, అదే స‌మ‌యంలో వారి కోసం కొంద‌రు పోలీసు వేషంలో మ‌ఫ్కీలో వ‌చ్చి వారిని తీసుకెళ్లేందుకు రావ‌డంతో దాంతో బాధితులు పెద్ద ఎత్తున ఏడుస్తూ మ‌ల్ల‌న్న‌ ముందు గోడు వెళ్ల‌బోసుకోవ‌డంతో ఇదంతా ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అస‌లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావాల‌నే త‌మ‌ను టార్గెట్ చేసి ఇలా వేధిస్తున్నారని ఎలాగైనా కాపాడాలంటూ కోర‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.ఇక అది చూసిన వారంతా మంత్రిపై నిప్పులు కురిపిస్తున్నారు.

The Public Is Angry With Minister Srinivas Gowd Even The Supremacy Over That Mat
Advertisement
The Public Is Angry With Minister Srinivas Gowd Even The Supremacy Over That Mat

ఒక బాధితులను ఇలా చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.ఇక ఈ విష‌యం కాస్తా అధిష్టానం దృష్టి దాకా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఈ విష‌యమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విప‌రీతంగా వైరల్ అవుతోంది.

ఇక దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ప్ర‌తిప‌క్షాలు కూడా రెచ్చిపోయే ఛాన్స్ ఉంది.అస‌లే టీఆర్ ఎస్ మీద మొద‌టి నుంచి ఇలాంటి వేధింపు ఆరోప‌ణ‌లు చాలానే ఉన్నాయి.

మ‌రి ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌పై మంత్రి ఎలా స్పందిస్తార‌నేది చూడాలి.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built
Advertisement

తాజా వార్తలు