ప్రతి సారి లక్నో ను సేవ్ చేస్తున్న ఒకే ఒక్కడు...

ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా ఆర్ సి బి, లక్నో సూపర్ జాయింట్స్ ( Lucknow Super Giants )మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆర్ సి బి హోమ్ గ్రౌండ్ లో వరుసగా జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది.

యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మాయాంక్ యాదవ్ ( Mayank Yadav )మరోసారి తన అద్భుతమైన బోలింగ్ తో ఆర్సిబి బ్యాట్స్ మెన్స్ లకి వెన్నులో వణుకు పుట్టించి లక్నో సూపర్ జాయింట్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తను వేసిన 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు.

తను వేసిన 24 బాల్స్ లో 17 డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను పరుగులు ఏమి చేయకుండా కట్టడి చేశాడు.వరుసగా రెండు మ్యాచ్ ల్లో మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.తను ఆడిన రెండు మ్యాచ్ లో 10 బంతులు 150 ప్లస్ స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో గంటకు 155.8 కిలోమీటర్ వేగంతో బౌలింగ్ చేయగా, ఈ మ్యాచ్ లో 156.7 వేగంతో బౌలింగ్ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు.ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్లలో 4 వ స్థానంలో నిలిచాడు.

ఈ వరుసలో షాన్ టైట్, ఫెర్గుసన్, ఉమ్రాన్ మాలిక్ సరసన చేరాడు.

Advertisement

ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన షార్ట్ బాల్స్, బౌన్సర్లకి బ్యాట్స్ మెన్స్ భయపడిపోయారు.మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ లాస్ట్ 3 ఓవర్లు మిగిలి ఉండగా బౌలింగ్ కి వచ్చి మ్యాచ్ ని ఒక్కసారిగా లక్నో వైపుకు టర్న్ చేసాడు.ఇతను అత్యంత వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా మంచి లైన్ అండ్ లెంత్ తో అక్యురసీగా బౌలింగ్ చేస్తున్నాడు.

ఇతను ఇలాగే ఆడితే నెక్స్ట్ జరగబోయే టి20 వరల్డ్ కప్( T20 World Cup ) కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు