Kishan Reddy :త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటన..: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వ్యూహంపై చర్చించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.ఈ మేరకు కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థుల వివరాలు సేకరించామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్( BRS ) దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందని విమర్శించారు.మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయాలకు తాళం వేశారన్న ఆయన తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి అని తెలిపారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు