డిజాస్టర్ టాక్ తో దంచికొట్టిన 'జపాన్' ఓపెనింగ్స్..తమిళం లో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు!

తెలుగు లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూర్య మరియు కార్తీ కచ్చితంగా ఉంటారు.

రజినీకాంత్ తర్వాత వీళ్ళిద్దరికే ఇక్కడ మంచి మార్కెట్ ఉంది.

రీసెంట్ గా ఇళయ తలపతి విజయ్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ, సూర్య మరియు కార్తీ( Karti ) కి మించి కాదని మాత్రం చెప్పొచ్చు.వాళ్ళిద్దరికీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఇక్కడి తెలుగు హీరోలతో సమానంగా వసూళ్లు వస్తాయి.

ఇది చాలా సార్లు రుజువు అయ్యింది.ఖైదీ చిత్రం తో కార్తీకి ఇక్కడ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది రీసెంట్ గా.ఆ సినిమా తర్వాత సర్దార్( Sardar ) చిత్రం ఇక్కడ సూపర్ హిట్ గా నిల్చింది.ఇప్పుడు రీసెంట్ గా ఆయన జపాన్ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.

The japan Openings, Which Were Hit With Disaster Talk, Collected More In Telug
Advertisement
The 'Japan' Openings, Which Were Hit With Disaster Talk, Collected More In Telug

సినిమా విడుదలకు ముందు టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాడు కార్తీ.డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ తో ట్రైలర్ తోనే నవ్వులు పూయించారు కార్తీ.సినిమాలో కూడా తన బెస్ట్ ఇవ్వడానికి సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ప్రయత్నం చేసాడు.

కానీ డైరెక్టర్ రాజమురగన్ ( Director Rajamuragan )రాసుకున్న చెత్త స్టోరీ లైన్ మరియు స్క్రీన్ ప్లే కారణంగా సినిమా కి ఫ్లాప్ టాక్ వచ్చింది.ఫస్ట్ హాఫ్ బాగుంది అని అనిపించుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ సహనం కి పరీక్ష పెట్టినట్టుగా అనిపించింది.

తమిళనాడు( Tamil Nadu ) ఈ చిత్రానికి కనీస స్థాయి ఓపెనింగ్స్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు.కానీ తెలుగు లో మాత్రం అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది ఈ చిత్రానికి.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం నూన్ షోస్ నుండి మ్యాట్నీస్ వరకు అద్భుతమైన ఆక్యుపెన్సీలను ఈ చిత్రం సొంతం చేసుకుందని కానీ ఫస్ట్ షోస్ నుండి నెగటివ్ టాక్ ప్రభావం బలంగా పడింది అంటూ చెప్పుకొస్తున్నారు.

The japan Openings, Which Were Hit With Disaster Talk, Collected More In Telug
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తమిళం లో ఈమాత్రం కూడా వచ్చే ఛాన్స్ లేదట.సర్దార్ మరియు వీరుమాన్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా రావడం కార్తీకి పెద్ద షాక్.

Advertisement

ఈ సినిమా తర్వాత ఎలాగో ఆయన ఖైదీ 2 చేస్తున్నాడు.ఈ చిత్రం తో సౌత్ ఇండియన్ ని షేక్ చేస్తాడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

తాజా వార్తలు