ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కాలిపోయిన బోగీలను పరిశీలించారు.

అయితే మంటల ధాటికి ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ లో మొత్తం ఏడు బోగీలు పూర్తిగా కాలిపోగా మిగిలిన బోగీలతో ట్రైన్ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.హౌరా నుంచి సికింద్రాబాద్ బయలు దేరిన ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ రైలులో బొమ్మాయిపల్లిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.

లోకో ఫైలట్ అప్రమత్తంగా వ్యవహారించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement