'ది ఇండియా హౌస్' అనౌన్స్ మెంట్ కు రెస్పాన్స్ అదిరిందిగా!

నిన్న రామ్ చరణ్ ( Ram Charan )నుండి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.

గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నాడు.

ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరో వైపు నిర్మాతగా మారిపోయాడు.ఇప్పటికే చరణ్ కు నిర్మాత సంస్థ ఉంది.

అయిన కూడా ఈయన యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి తాజాగా కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసాడు.వీరు సంయుక్తంగా స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వి మెగా పిక్చర్స్ నుండి నిన్న తమ ఫస్ట్ సినిమాను అనౌన్స్ చేసిన విషయం విదితమే.

ఎవ్వరు ఊహించని విధంగా కుర్ర హీరోతో వీరి మొదటి సినిమా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

ఎందుకంటే రామ్ చరణ్ ఇంత రిస్క్ చేసి కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి సినిమాను చేయడం అంటే మాములు విషయం కాదు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddhartha )హీరోగా వీరి ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.ఈ సినిమాను నూతన డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసారు.ది ఇండియా హౌస్( The India House ) పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నారు.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది.సోషల్ మీడియాలో సూపర్ గా ట్రెండ్ అవుతుంది.యూట్యూబ్ లో కూడా భారీ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతున్న ఈ సినిమా 1900 దశకం సమయంలో ఇండియాలో జరిగిన చరిత్రకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించ నున్నారు.

అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానున్న ఈ సినిమాతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా కొలాబరేట్ అయ్యారు.చూడాలి రామ్ చరణ్ ఈ డిఫరెంట్ సినిమాతో నిర్మాతగా లాభాలను అందుకుంటాడో లేదో.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
Advertisement

తాజా వార్తలు