రేపు తొలిసారి ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ భేటీ

దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ రేపు మొదటిసారిగా భేటీ కానుంది.ఈ మేరకు ఢిల్లీలోని ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సీట్ల పంపకాలు వంటి కీలక అంశాలపై కమిటీ ప్రధానంగా చర్చించనుందని తెలుస్తోంది.దాంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

The India Alliance Coordination Committee Will Meet For The First Time Tomorrow-

కాగా వివిధ పార్టీలకు చెందిన సుమారు పద్నాలుగు మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.అదేవిధంగా ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పని చేస్తోంది.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు