హస్తం శాశ్వతం.. కమలం వాడిపోతుంది.: ఖర్గే కామెంట్స్

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ( Congress) పార్టీకి బీజేపీ (BJP)భయపడుతోందని తెలిపారు.

ఓటమి భయంతోనే రాజకీయాల్లోకి మతాన్ని లాగుతుందని బీజేపీపై ఖర్గే ఆరోపణలు చేశారు.ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తున్నారన్న ఖర్గే బీజేపీ హయాంలో తెలంగాణకు(Telangana) ఏమీ రాలేదని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని పేర్కొన్నారు.తెలంగాణలో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్న ఖర్గే మరో గ్యారంటీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని చెప్పారు.

కోడ్ ముగిసిన వెంటనే గ్యారంటీని అమలు చేస్తామని తెలిపారు.రైతుబంధు (Rythu Bandhu) నిధులు రైతుల ఖాతాలో వేశామన్న ఖర్గే కేంద్రంలో అధికారంలోకి రాగానే గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే హస్తం శాశ్వతమన్న ఖర్గే కమలం వాడిపోతుందని తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు