తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ము లాటలు సర్వసాధారణంగా మారి పోయాయి.
సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ నానా రచ్చ చేస్తుండడం పరిపాటిగా మారింది.
తెలంగాణలో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరు దృష్టి పెట్టకపోగా, సొంత పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటాలు చేయడం వంటి వ్యవహారాలు తెలంగాణలో కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.మరో వైపు చూస్తే టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయంపై దృష్టి సారించారు.
అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి జాతీయ నాయకుల వరకు తెలంగాణపై దృష్టి సారించారు.
ఇక్కడబీజేపీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇవేమి పట్టించు కోకుండా అంతర్గత వ్యవహారాలతో సత మతం అవుతున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు అంతా కొంతకాలంగా రహస్యంగా సమావేశమవుతూ అనేక అంశాలపై చర్చిస్తున్నారు.
నిన్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ సమావేశం అయ్యారు.దీనిపై రేవంత్ వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేయగా , ఈ సమావేశం గురించి ఆరా తీస్తూ ఏఐసిసి కార్యదర్శి బోస్ రాజు, పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కి ఫోన్ చేశారు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా సమావేశాలు నిర్వహించ వద్దని , అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధిష్ఠానం పెద్దలు హెచ్చరికలు చేసినా పెద్దగా అయితే ఫలితం కనిపించ లేదు.రేవంత్ విషయంలో తెలంగాణ సీనియర్ నేతలు అంతా ఒక్కటే అసమ్మతి రాగం వినిపిస్తూ ఉండడం , అంతర్గత పోరు తోనే కాలం వెళ్లదీస్తు ఉండటం వంటివి కాంగ్రెస్ విజయవకాశాలను బాగా దెబ్బతీస్తున్నాయి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy