వీడియో: పెళ్లిమండపం పైనే వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు.. ఎందుకంటే..

ఈ రోజుల్లో పెళ్లిలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఇందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తే, మరికొన్ని మాత్రం నివ్వెరపరుస్తాయి.

అయితే తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా చమారీ గ్రామంలో రీనా అనే అమ్మాయి నివసిస్తోంది.

అయితే తాజాగా ఈ యువతి హమీర్‌పూర్‌లో నివసించే రవికాంత్ అహిర్వార్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది.ఈ పెళ్లి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు.

Advertisement

అయితే జయమాల వేడుకలో పెళ్లి కూతురు పెళ్ళికొడుకు చెంప చెల్లుమనిపించింది.ఎందుకంటే ఆ వరుడు బాగా తప్పతాగి పెళ్లి మండపం పైకి వచ్చాడట.ఈ ఊహించని షాక్ తో వరుడికి మతిపోయినంత పనయ్యింది.

తన భార్య కొడుతుంటే అతడు బొమ్మ లాగా చూస్తుండిపోయాడు.శుభమా అని పెళ్లి చేసుకున్న రోజు ఇలా మందు తాగి వస్తావా అని వధువు వరుడిని కొట్టినట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లిమండపం పైన వధూవరులు దండలు మార్చుకోవడం చూడొచ్చు.అయితే వరుడు మెడలో దండ వేస్తున్న సమయంలో వధువు కోపంతో ఊగిపోయింది.అంతటితో ఆగకుండా వరుడి చెంపపై మూడు, నాలుగుసార్లు చెడామడా వాయించేసింది.

అలా లాగి పెట్టి కొట్టి మండపం పై నుంచి కిందకి దిగి ఆమె వెళ్ళిపోయింది.తర్వాత బంధుమిత్రులు నూతన దంపతులకు నచ్చజెప్పడంతో పెళ్లితంతు విజయవంతంగా పూర్తయింది.

అమ్మ మీద కోపం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సిరి వెన్నెల

అయితే పెళ్లి కొడుకును పెళ్లి కూతురు కొట్టిన దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇప్పుడది వైరల్ గా మారింది.

Advertisement

అయ్యో పాపం ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఆ తర్వాత వరుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూడండి.

తాజా వార్తలు