గవర్నర్ అభ్యంత్రం ?  ఆ ఇద్దరూ ఎమ్మెల్సీలు అయ్యేనా ? 

మొదటి నుంచి తనను నమ్ముకున్న వారినే కాదు, తనను నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో నలుగురుని ఎమ్మెల్సీలుగా జగన్ ఎంపిక చేశారు.

ఈ నలుగురిని ఎమ్మెల్సీలను చేయాలని జగన్ ఎప్పటి నుంచో అనుకున్నారు.

ఈ మేరకు వైసీపీ నుంచి ఆ నాలుగు పేర్లు బయటకు వచ్చాయి.దీనిని గవర్నర్ ఆమోదం కోసం పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపించి దాదాపు ఐదు రోజులు అవుతున్నా, అక్కడి నుంచి  దీనికి ఆమోదం లభించక పోవడంతో వైసీపీలో కంగారు మొదలైంది.తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి , కొయ్యే మోషేన్ రాజు, ఆర్ వి రమేష్ పేర్లను వైసిపి అధిష్టానం ఎంపిక చేయగా, ఈ నాలుగు పేర్లలో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు అభ్యర్ధిత్వంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి కారణం వీరిపై ఉన్న క్రిమినల్ కేసు లే అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి పై క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే విషయం గవర్నర్ కు ఏ విధంగా సమాచారం అందిందో తెలియదు గాని, వీటి గురించి పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాతే ఈ రెండు పేర్ల పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పై శిరోముండనం కేసు ఉంది.దీనిపై విచారణ జరుగుతోంది.

అలాగే గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి పైన అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే వీరిని ఎంపిక చేసేందుకు గవర్నర్ ఇష్టపడడం లేదు అనే సమాచారం వైసీపీ లో కంగారు పుట్టిస్తోంది.

దీనిపై క్లారిటీ తీసుకునేందుకు,  గవర్నర్ కు నచ్చజెప్పేందుకు జగన్ ఈరోజు గవర్నర్ కలవాలని నిర్ణయించుకున్నారట.క్రిమినల్ కేసులు ఉన్న వారిని గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తే ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉండడం తో జగన్ ఈ రోజు గవర్నర్ ను కలిసి క్లారిటీ ఇస్తారట.వీరి పేర్లను కనుక గవర్నర్ తిరస్కరిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే టెన్షన్ లో వైసీపీ ఉంది.

గవర్నర్ తో జగన్ భేటీ ముగిసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు