ఏనుగు ఎక్కి జారిపడ్డ డిప్యూటీ స్పీకర్ !

అంబారీ మీద గొప్పగా ఊరేగుదమున్న ఆ నాయకుడి ఆశలు గల్లంతయ్యాయి.అదుపుతప్పి ఏనుగు మీద నుంచి కిందపడడంతో ప్రజలంతా గొల్లుమని నవ్వారు.

ఇదేంట్రా బాబు ఏనుగు మీద ఊరేగుతూ తన దర్పం ప్రదర్శిద్దామనుకుంటే.ఉన్న పరువు ఇలా రోడ్ మీద పడింది అని ఆ నేత అవమానంతో తన కౌకు దెబ్బలు చూసుకుని లబోదిబోమన్నాడు.

అసోం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఏనుగుపై నుంచి జారి కిందపడ్డారు.కరీంగంజ్‌ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన రాతాబరిలో పర్యటిస్తున్నారు.ఈ సమయంలో కృపానాథ్‌ మల్లాహ్‌ ఏనుగుపైకి ఎక్కారు.

ఒక్కసారిగా ఏనుగు ముందుకు వెళ్లడంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు.అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement

ఇటీవలే మల్లాహ్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నియ్యారు.ఈ సందర్భంగా ఆయన అనుచరులు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో మల్లా ఏనుగుపైకి ఎక్కారు.భారీగా కార్యకర్తలు గుమిగూడటంతో ఏనుగు బెదిరి ముందుకు వెళ్లడంతో ఆయన ఇలా కిందపడాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు